Asianet News TeluguAsianet News Telugu

Ind Vs Nz: న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఎవరూ ఊహించని ఓపెనర్ తో బరిలోకి దిగుతున్న టీమిండియా..? ఆ బౌలర్ ట్వీట్ వైరల్

India Vs New Zealand: జట్టులో రోహిత్-రాహుల్ రెగ్యులర్ ఓపెనర్లుగా ఉన్నా  ప్రపంచకప్ లో  కోహ్లీ.. ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పంపి విమర్శలు ఎదుర్కున్నాడు. ఇక నేటి మ్యాచ్ లో కూడా ఐపీఎల్ లో మెరిసిన  వెంకటేష్ అయ్యర్ అరంగ్రేటం చేయనున్నాడు.

Deepak Chahar hilariously wants to open the batting at his home ground, Tweet Goes Viral
Author
Hyderabad, First Published Nov 17, 2021, 7:07 PM IST

జైపూర్ వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మద్య కొద్దిసేపట్లో తొలి టీ20 మ్యాచ్  మొదలుకానున్నది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా.. సెమీస్ కు చేరకుండా ఇంటికి తిరిగొచ్చింది. కొద్దికాలంగా జట్టు కూర్పు  సరిగా లేదన్నది ప్రధాన ఆరోపణ. జట్టులో రోహిత్-రాహుల్ రెగ్యులర్ ఓపెనర్లుగా ఉన్నా  ప్రపంచకప్ లో  కోహ్లీ.. ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పంపి విమర్శలు ఎదుర్కున్నాడు. ఇక నేటి మ్యాచ్ లో కూడా ఐపీఎల్ లో మెరిసిన  వెంకటేష్ అయ్యర్ అరంగ్రేటం చేయనున్నాడు. అతడు కూడా ఓపెనింగ్ చేయగల సమర్థుడే.

అయితే ఈ మ్యాచ్ లో రోహిత్-రాహుల్ ఓపెనింగ్ గా వస్తారా..? లేక  వెంకటేష్ అయ్యర్ తో వేరే వాళ్లను పంపిస్తారా..? అన్నదానిమీద ఇంకా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోలేదు. తుది జట్టులో ఎంపికను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్ దీపక్  చాహర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. తానే ఇన్నింగ్స్ ఓపెన్ చేయబోతున్నానంటూ.. ట్విట్టర్ లో పోస్టు చేశాడు. 

దీపక్ చాహర్ స్పందిస్తూ.. ‘ఈరోజు రాత్రి నా హోం గ్రౌండ్ లో ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు అంతా సిద్ధమైంది..’ అని రాయడమే గాక చేతిలో బ్యాట్ పట్టుకుని  కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడుతున్న ఫోటోను దానికి జతచేశాడు. చాహర్ ఫన్నీగా చేసిన  ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతున్నది.

 

ఆగ్రాకు చెందిన చాహర్.. రాజస్థాన్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతాడు. అంచెలంచెలుగా ఎదిగిన చాహర్.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతాడన్న విషయం తెలిసిందే. ధోని నీడన ఎదిగిన ఈ ఫాస్ట్ బౌలర్.. 2018లోనే టీమిండియాలోకి అరంగ్రేటం చేశాడు. కానీ జట్టులోకి వస్తూ పోతూ ఇబ్బందులు పడుతున్నాడు. ఐపీఎల్ లో నిలకడగా బౌలింగ్ చేసే చాహర్.. భారత జట్టు తరఫున సుదీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నాడు.

అయితే బౌలర్ గానే గాక చాహర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. గత జులై లో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టు లో దీపక్ కూడా సభ్యుడు. లంకతో రెండో వన్డే సందర్భంగా.. చహర్ 69 బంతుల్లో 82 పరుగులు చేసి వావ్ అనిపించాడు. ఇందులో 7 ఫోర్లు, ఒక సిక్స్ కూడా ఉండటం గమనార్హం.  276 పరుగుల ఛేదనలో భారత జట్టు 160 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో చాహర్ బ్యాటింగ్ కు వచ్చి దుమ్ముదులిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios