టీమిండియాలోనే కాదు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ వికెట్ కీపర్ ఎవరంటే ముందుగా వినిపించే పేరు మహేంద్ర సిగ్ ధోనిది. అది అంతర్జాతీయ క్రికెట్ అయినా ఐపిఎల్ మ్యాచ్ అయినా వికెట్ కీపర్ అతడు అదరగొడుతుంటాడు. అలాంటి ధోనికి కూడా సాధ్యం కాని ఓ అరుదైన ఘనత ఐపిఎల్ సీజన్ 12 లో సాధించి యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతం సృష్టించాడు.

ఐపిఎల్ లో డిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున రిషబ్ పంత్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అతడు అటు బ్యాటింగ్ తో పిటు కీపింగ్ లోనూ అదిరిపోయే ప్రదర్శన చేస్తూ డిల్లీ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఇలా ఆదివారం రాయల్ చాలెంజర్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్ లోనూ పంత్ కీపర్ గా అద్భుతం చేశాడు. ఈ మ్యాచ్ లో అతడు రెండు క్యాచ్ లను అందుకుని డిల్లీ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ గా అతడి పేరిట ఓ అరుదైన రికార్డు నమోదయ్యింది.
ఐపీఎల్ సింగిల్ సీజన్‌లో 20 ఔట్లలో భాగస్వామ్యం వహించిన ఏకైక వికెట్ కీపర్ గా పంత్ రికార్డు నెలకొల్పాడు. డెక్కన్ చార్జర్స్ వికెట్ కీపర్ సంగక్కర 2011 ఐపిఎల్ సీజన్లో 19 ఔట్లలో భాగస్వామ్యం వహించడమే రికార్డు. పంత్ 2019 సీజన్లో మరో రెండు లీగ్ మ్యాచ్ లు మిగిలివుండగానే ఆ రికార్డును బద్దలుగొట్టాడు. మొత్తంగా ఈ ఐపిఎల్ లో ఇప్పటివరకు పంత్ 12 మ్యాచులాడి 15 క్యాచ్‌లు పట్టడంతో పాటు 5 స్టంపౌట్లు చేశాడు.
ఆదివారం ఆర్సిబిని ఓడించిన డిల్లీ ఈ సీజన్లో చెన్నై తర్వాత ప్లేఆఫ్ కు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఆర్సిబితో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ తో ఆకట్టుకోలేకపోయిన పంత్ కీపింగ్ లో మాత్రం అదరగొట్టాడు. అద్భుతమైన క్యాచ్ లను అందుకుని ఆర్సిబి బ్యాట్ మెన్స్ క్లాసెన్, గురుకీరత్ సింగ్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఇలా జట్టు విజయం కోసం ప్రయత్నించే క్రమంలో పంత్ వ్యక్తిగతంగా కూడా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 29, 2019, 4:37 PM IST