Asianet News TeluguAsianet News Telugu

DCvsMI: మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తడ‘బ్యాటు’... ముంబై ముందు ఈజీ టార్గెట్...

వరుస వికెట్లు తీసి, ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టేసిన ముంబై బైలర్లు...

మూడు వికెట్లు తీసిన బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌‌కి 2 వికెట్లు...

కీలక మ్యాచులో చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్... 

DC vs MI: delhi capitals failed to score reasonable total against MI CRA
Author
India, First Published Oct 31, 2020, 5:08 PM IST

IPL 2020: ఫ్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యువ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ తడబడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్ కావడంతో 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ. పృథ్వీ షా 10, శ్రేయాస్ అయ్యర్ 25, రిషబ్ పంత్ 21, మార్కస్ స్టోయినిస్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను అయ్యర్, పంత్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి జోడించిన 35 పరుగులే ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. అయ్యర్ అవుటైన తర్వాత వరుస హర్షల్ పటేల్ 5, హెట్మయర్ 11, రవిచంద్రన్ అశ్విన్ 12 పరుగులు చేశారు.

ఆఖర్లో రబాడా 12, ప్రవీణ్ దూబే 7 పరుగులు చేయడంతో ఆలౌట్ ప్రమాదాన్ని తప్పించుకుంది ఢిల్లీ.  ముంబై బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 3 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్ మూడు, కౌల్టర్ నీల్, రాహుల్ చాహార్ చెరో వికెట్ తీశారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios