ఐదురోజుల పాటు చప్పగా సాగి ‘డ్రా’ గా ముగిసిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ తొలి టెస్టు... క్రీజులో బాంగ్రా స్టెప్పులతో పాక్ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన డేవిడ్ వార్నర్...
ప్రపంచవ్యాప్తంగా భారత మాజీ సారథి కోహ్లీకి వందల మిలియన్ల ఫాలోవర్లు రావడానికి ప్రధాన కారణం ఆన్‌ఫీల్డ్ విరాట్ యాటిట్యూడ్. క్రీజులో ఉన్నంతసేపు రెడ్ బుల్ ఎనర్జీ నింపుకున్నట్టుగా, ఫుల్లీ లోడెడ్ గన్‌లా అందరిలోనూ ఉత్సహం నింపుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ...
టెస్ట్ మ్యాచ్ బోరింగ్‌గా సాగుతున్న సమయంలో క్రీజులో స్టెప్పులు వేస్తూ ఫ్యాన్స్‌ని అలరించడం విరాట్ కోహ్లీ స్పెషాలిటీ. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా విరాట్ కోహ్లీ స్టైల్‌ని ఫాలో అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు, పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే...
24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో తొలిసారిగా పర్యటిస్తోంది ఆస్ట్రేలియా జట్టు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియా చేతుల్లో పరాభవాన్ని చవిచూసిన పాకిస్తాన్ జట్టు, స్వదేశంలో అలాంటి ఓటమి వస్తుందేమోననే భయంతో తొలి టెస్టు కోసం పూర్తిగా నిస్తేజమైన పిచ్‌ని రూపొందించింది...
రావల్పిండిలో జరిగిన తొలి టెస్టు ఐదు రోజుల పాటు సాగినప్పటికీ పడిన వికెట్లు మాత్రం 14. తొలి ఇన్నింగ్స్‌లో షఫీక్ 44, ఇమామ్ ఉల్ హక్ 157 పరుగులు, అజర్ ఆలీ 185 పరుగులు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 476 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది పాకిస్తాన్. బాబర్ ఆజమ్ 82 బంతుల్లో 3 ఫోర్లతో 36 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 140.1 ఓవర్లలో 459 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఉస్మాన్ ఖవాజా 159 బంతుల్లో 15 ఫోర్లతో 97 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 114 బంతుల్లో 12 ఫోర్లతో 68 పరుగులు చేశాడు.

మార్నస్ లబుషేన్ 158 బంతుల్లో 12 ఫోర్లతో 90 పరుగులు, స్టీవ్ స్మిత్ 196 బంతుల్లో 8 ఫోర్లతో 78 పరుగులు, కామెరూన్ గ్రీన్ 48 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్ నౌమన్ ఆలీ 38.1 ఓవర్లలో 107 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు...
తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకున్న పాకిస్తాన్, రెండో ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. ఇక ఫలితం తేలడం అసాధ్యమని తేలడంతో ఇరుజట్లు డ్రాకి అంగీకరించాయి. అబ్దుల్లా షఫీక్ 136 పరుగులు, ఇమామ్ వుల్ హక్ 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు...
అప్పటికే మ్యాచ్ డ్రా అవుతుందని ఫిక్స్ కావడంతో స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల్లో జోష్ నింపేందుకు డేవిడ్ వార్నర్, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కొన్ని డ్యాన్స్ మూవ్స్ వేశాడు. విరాట్ కోహ్లీ స్టెప్స్‌ను ఫాలో అవుతూ ‘బాంగ్రా’ స్టెప్స్ వేసి, పాక్ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాడు వార్నర్...
అంతకుముందు డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాక్ బౌలర్లు షాజిద్ ఖాన్, షాహీన్ ఆఫ్రిదీ... సెడ్జ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే వారికి చిరునవ్వుతో సమాధానం చెప్పిన డేవిడ్ వార్నర్... ‘పిల్లలురా మీరు...’ అన్నట్టు ఓ లుక్ ఇచ్చి, వారి ఇగోను చంపేశాడు.
24 ఏళ్ల తర్వాత స్వదేశంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రసవత్తరమైన హోరాహోరీ పోరు చూద్దామని ఆశించిన క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రం నిరాశే ఎదురైంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మార్చి 12న ప్రారంభం కానుంది.
