తొలి రెండు టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అయిన డేవిడ్ వార్నర్... ఆకట్టుకుంటున్న ట్రావిస్ హెడ్! వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వార్నర్ ఆడించడమే కరెక్ట్ అంటున్న రికీ పాంటింగ్..
భారత పర్యటనలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో భాగంగా మొదటి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది... ఇండోర్ టెస్టు విజయంతో ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించింది ఆస్ట్రేలియా...
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన డేవిడ్ వార్నర్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ట్రావిస్ హెడ్... మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. కామెరూన్ గ్రీన్ మిడిల్ ఆర్డర్‌లో రీఎంట్రీ ఇచ్చి మంచి ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం ఏడాదిగా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు... నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో 1, 10 పరుగులు చేసి అవుటైన వార్నర్, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు..
మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్, డేవిడ్ వార్నర్ చేతికి బలంగా తగిలింది. ఈ గాయం కారణంగా ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రాని డేవిడ్ వార్నర్, మిగిలిన టెస్టు సిరీస్ నుంచి దూరమయ్యాడు.
జనవరి 2022 నుంచి 14 టెస్టు మ్యాచులు ఆడిన డేవిడ్ వార్నర్, 26.39 సగటుతో 607 పరుగులు చేశాడు. ఇందులో సౌతాఫ్రికాతో జరిగిన మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌లో చేసిన డబుల్ సెంచరీ తీసివేస్తే మిగిలిన 13 టెస్టుల్లో చేసింది 400 పరుగులే...
దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎవరిని ఆడించాలి? డేవిడ్ వార్నర్‌నా? లేక ట్రావిస్ హెడ్ నా? ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్..
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌ని ఆడించి తీరాలి. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్ గెలవాలంటే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవాలి...
డేవిడ్ వార్నర్‌కి ఇంగ్లాండ్‌లో మంచి రికార్డు లేదు. అయితే అంతమాత్రాన డేవిడ్ వార్నర్‌ని పక్కనబెట్టడం కరెక్ట్ కాదు. యాషెస్ సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో వార్నర్‌ని ఆడించాలి, బాగా ఆడితే కొనసాగించాలి... లేదంటే వేరే ప్లేయర్‌ని తీసుకుంటే బెటర్...
డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో సిడ్నీ టెస్టు మ్యాచ్ తర్వాత వార్నర్ రిటైర్ అయితే బాగుండేది. అయితే అతను మెల్‌బోర్న్‌లో 100వ టెస్టు ఆడి 200 పరుగులు చేశాడు... కెరీర్‌లో 100వ టెస్టు ఆడడం, అందులో డబుల్ సెంచరీ బాదడం ఎవరికైనా చాలా పెద్ద అఛీవ్‌మెంటే..
స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య రిటైర్ అవ్వాలనే ఏ క్రికెటర్ అయినా అనుకుంటాడు. అయితే మళ్లీ అలాంటి ఛాన్స్ రావాలంటే ఏడాది వరకూ ఎదురుచూడాల్సిందే... ’అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్..
అహ్మదాబాద్‌లో జరిగే నాలుగో టెస్టులో టీమిండియా గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరుతుంది. ఇంగ్లాండ్‌లో జూన్ మొదటి వారంలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇండియా, ఆస్ట్రేలియా మరోసారి తలబడతాయి..
