హైదరాబాద్: సన్ రైజర్స్ హైదారబాద్ జట్టులో హైదారాబదుకు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఎ) అధ్యక్షుడు అజరుద్దీన్ స్పందించారు. హైదారాబాదు ఆటగాళ్లు సన్ రైజర్స్ జట్టులో లేకపోవపడాన్ని ఆయన తప్పు పట్టారు.

తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాదులో జరిగే ఐపిఎల్ మ్యాచులను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాదులో సత్తా చాటగలిగే క్రికెటర్లు చాలా మంది ఉన్నారని ఆయన చెప్పారు. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టులో ఒక్క హైదరాబాదీ కూడా లేకపోవడం దారుణమని ఆయన అన్నారు.

ఇప్పటికైనా హైదరాబాద్ క్రికెటర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తన జట్టులోకి తీసుకోవాలని, లేదంటే పేరు మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు.