Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి... రోహిత్ శర్మ అరుదైన రికార్డు...

ఐపీఎల్‌లో ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలించిన మొదటి బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ...

మూడు సార్లు మొదటి బంతిని ఫేస్ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గానూ ‘హిట్ మ్యాన్’...

CSK vs MI: Rohit Sharma Creates very rare record in IPL history CRA
Author
India, First Published Sep 19, 2020, 8:30 PM IST

ఐపీఎల్ 13వ సీజన్‌లో మొదటి బంతిని ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలించిన మొదటి బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. ఇంతకుముందు సీజన్లలో ఐదుసార్లు మొదటి బంతికి పరుగులేమీ రాకపోగా... మొదటి సీజన్‌లో ఎల్‌బీ రూపంలో సింగిల్ వచ్చింది.

2010, 2013 సీజన్లలో మొదటి బంతికే వికెట్ పడగా... 2012 సీజన్‌లో మొదటి బంతికే వైడ్ రూపంలో ఎక్స్‌ట్రా వచ్చింది. 2009, 2016, 2019 సీజన్లలో మొదటి బంతికి సింగిల్ వచ్చింది. అంతేకాకుండా 13 సీజన్లలో రోహిత్ శర్మ మొదటి బంతిని ఎదుర్కోవడం ఇది మూడో సారి. ఇంతకుముందు 2015లో, 2018లో కూడా మొదటి బంతిని రోహిత్ శర్మనే ఎదుర్కొన్నాడు.

రోహిత్ శర్మ తప్ప మిగిలిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఏ బ్యాట్స్‌మెన్‌కి కూడా సీజన్‌లో మొదటి బంతిని ఎదుర్కొనే అవకాశం రెండోసారి కూడా రాకపోవడం విశేషం. లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుట్ అవ్వడం ఇదో తొమ్మిదో సారి.

Follow Us:
Download App:
  • android
  • ios