ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే బౌండరీల మోత మోగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 12, డి కాక్ 33 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 92 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో సౌరవ్ తివారీ, హార్ధిక్ పాండ్యా కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

పాండ్యా వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదగా... తివారీ ఫోర్లతో ఆకట్టుకున్నాడు. 31 బంతుల్లో 42 పరుగులు చేసిన తివారీ జడేజా బౌలింగ్‌లో భారీషాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో 2 సిక్సర్లతో 14 పరుగులు చేసిన పాండ్యా కూడా జడేజా ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు. ఇద్దరినీ బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచులతో పెవిలియన్ చేర్చాడు డుప్లిసిస్. కృనాల్ పాండ్యా 3, పొలార్డ్ 18 పరుగులు చేయగా ప్యాటిన్సన్ 11 పరుగులు చేశాడు. ట్రెంట్ బౌల్ట్ డకౌట్ అయ్యాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇంగిడి మూడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహార్ రెండు వికెట్లు దక్కగా... పియూష్ చావ్లా, సామ్ కుర్రాన్ ఒక్కో వికట్ దక్కింది.