Asianet News TeluguAsianet News Telugu

CSK vs MI: ధోనీకి 49, రోహిత్‌కి 51... ‘హిట్ మ్యాన్’కే విన్నింగ్ ఛాన్స్...

టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్...

రైనా, భజ్జీ లేకుండా బరిలో దిగుతుండడంతో మహేంద్ర సింగ్ ధోనీపై ప్రెషర్... 15 నెలల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న మాహీ... రిటైర్మెంట్ తర్వాత తొలిసారిగా ఫీల్డ్‌లోకి...

CSK vs MI Match Preview: Rohit have more chances than MS Dhoni CRA
Author
India, First Published Sep 19, 2020, 2:33 PM IST

మనదేశంలో పిచ్, సొంత గ్రౌండ్ వంటివి జట్టుకు కలిసొచ్చే అంశాలు. కాబట్టి టాస్ గెలిచినా, గెలవకపోయినా ఆ ప్రభావం మ్యాచ్ ఫలితంపై చాలా తక్కువగా ఉండేది. అయితే దుబాయ్‌లో పరిస్థితులు వేరే. మ్యాచ్ ఫలితాన్ని టాస్ నిర్ణయించబోతోంది. గత మూడు సీజన్లుగా ఇక్కడ జరిగే (పీఎస్ఎల్) పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో టాస్‌ కీలక పాత్ర పోషించింది. పీఎస్‌ఎల్‌లో మూడు మ్యాచుల్లో రెండు సార్లు టాస్‌ నెగ్గిన జట్టే విజయం సాధించింది. ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించవచ్చు.

కారణం లక్ష్యం డిసైడ్ అయ్యాక, చేధన పెద్ద కష్టమేమీ కాదని వాళ్లు భావించవచ్చు. కానీ దుబాయ్ వాతావరణాన్ని, పిచ్‌లను అంచనా వేస్తే మాత్రం తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టునే విజయం వరించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. కాబట్టి ధోనీ టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపించవచ్చు.

దుబాయ్ పిచ్‌లపై వికెట్ల వేటలో ప్రధాన ఆయుధం పేసర్లే. పాక్ సూపర్ లీగ్‌లో ఎక్కువ వికెట్లు దక్కింది వీరికే. కాబట్టి ముంబై స్టార్ పేసర్ బుమ్రాకి ఈ పిచ్ బాగా కలిసి రావచ్చు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయడానికి స్పిన్‌ది ప్రధాన పాత్ర. సూపర్‌కింగ్స్‌ సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్‌ తాహీర్‌‌కు ఈ పిచ్ బాగా కలిసి రావచ్చు. 

రోహిత్ ఓపెనర్‌గా రావాలని ఫిక్స్ కావడంతో యంగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ‘హిట్ మ్యాన్’ ఓపెనింగ్ చేస్తాడు. వన్‌డౌన్‌లో డి కాక్ బ్యాటింగ్‌కి వస్తాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, హర్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్ వచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేస్తే... షేన్ వాట్సన్, డుప్లిసిస్ ఓపెనర్లు వస్తారు. వన్‌డౌన్‌లో అంబటి రాయుడిని పంపి, తనకి అచొచ్చిన టూ డౌన్‌లో ధోనీ బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం బాగా ఉంది. ఆ తర్వాత కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, బ్రావో బ్యాటింగ్‌కి రావచ్చు. 
దుబాయ్ వాతావరణంలో క్రీజులో ప్రేక్షకులు కూడా లేకుండా జరిగే మొదటి మ్యాచ్ కాబట్టి... ఆరంభ మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం తక్కువే. 140 నుంచి 180 లోపే స్కోరు నమోదవ్వవచ్చు. మొదటి మ్యాచులో ఒత్తిడిలో ఉండే ధోనీ జట్టుతో పోలిస్తే, ఉత్సాహంతో ఉండే ముంబై జట్టుకు 2 శాతం గెలుపు అవకాశాలు ఎక్కువని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios