పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలను మార్చి, ఫలితాలను రాబట్టడంలో మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతే ఎవ్వరైనా. ధోనీ ఈ టెక్నిక్ కారణంగానే భారత జట్టుకు రెండు వరల్డ్ కప్‌లు అందించగలిగాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో మరోసారి తన వ్యూహ చతురతను చూపించాడు ధోనీ. ఓ వైపు డికాక్ దూకుడుగా ఆడుతున్నప్పుడు బౌలింగ్‌ని మార్చాడు ధోనీ.

పేసర్లకు బదులుగా స్పిన్నర్ పియూష్ చావ్లాకి బంతికి ఇచ్చాడు. బౌండరీలకి అడ్డుకట్టు వేసిన చావ్లా, డేంజరస్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మను అవుట్ చేశఆడు. అలాగే కరెక్టు టైమ్‌లో సామ్ కుర్రాన్‌కి బంతిని ఇచ్చాడు. దీపక్ చాహార్‌ బౌలింగ్‌లో ఎంతో ఫ్రీగా బౌండరీలు బాదిన డి కాక్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అలాంటి షాట్‌కే ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఒకానొక దశలో 45/0 ఉన్న ముంబై జట్టు, 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వెంటవెంటనే అవుట్ కావడంతో ముంబై రన్‌రేట్ తగ్గింది.