Asianet News TeluguAsianet News Telugu

CSKvsKKR: చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠ విజయం... కేకేఆర్ ఫ్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం...

వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్...

మళ్లీ నిరాశపరిచిన మహేంద్ర సింగ్ ధోనీ...

 మెరుపులు మెరిపించిన జడేజా...

CSK vs KKR: chennai super kings thrilling win against Kolkata CRA
Author
India, First Published Oct 29, 2020, 11:12 PM IST

IPL 2020 సీజన్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆఖరి బంతికి విజయం అందుకుంది. 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సినదశలో ఆఖరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు రవీంద్ర జడేజా. ప్లేఆఫ్ రేసు నుంచి దూరమైన తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. 

173 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 14 పరుగులు చేసిన షేన్ వాట్సన్ అవుట్ అయ్యాడు. అంబటి రాయుడు 20 బంతుల్లో 38 పరుగులు చేసి అవుట్ కాగా... ఎమ్మెస్ ధోనీ 1 పరుగుకే మరోసారి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 

53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్... వరుసగా సీజన్‌లో రెండో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. శామ్ కర్రాన్ 13, రవీంద్ర జడేజా 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios