ఐపీఎల్  - 16 లో చెన్నై  సూపర్ కింగ్స్ తరఫున  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు పొందిన తుషార్ దేశ్‌పాండే  త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.  

మరో భారత క్రికెటర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. దేశవాళీలో ముంబై తరపున ఆడుతూ ఇటీవలే ఐపీఎల్ - 16 లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు పొందిన తుషార్ దేశ్‌పాండే త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూన్ 12న తుషార్.. తన చిన్ననాటి క్రష్.. స్కూల్ రోజుల నుంచి పరిచయమున్న నభాతో నిశ్చితార్థం కార్యక్రమం ఘనంగా జరిగింది. 

ముంబైకి చెందిన తుషార్‌కు నభా చిన్ననాటి నుంచే పరిచయం. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఇప్పుడు కలిసి ఏడడుగులు వేయబోతున్నారు. ఎంగేజ్మెంట్ గురించి తుషార్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘ఆమె నా స్కూల్ క్రష్ నుంచి నా భార్యగా ప్రమోట్ అయింది..’ అని క్యాప్షన్ పెడుతూ తుషార్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసుకున్నాడు. కాగా టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ లు రుతురాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్కే క్రికెటర్లతో పాటు తన ముంబై టీమ్ మేట్స్ కూడా తుషార్ కు విషెస్ అందజేశారు. 

View post on Instagram

ముంబైకి చెందిన తుషార్.. దేశవాళీలలో అదే జట్టు తరఫున ఆడుతున్నాడు. 2016లో రంజీ ట్రోఫీ ద్వారా ముంబై టీమ్ కు ఎంట్రీ ఇచ్చిన అతడు.. దేశవాళీలో రాణించడంతో 2020 ఐపీఎల్ వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 20 లక్షల ప్రాథమిక ధరకు సొంతం చేసుకుంది. కానీ అక్కడ అతడికి గుర్తింపు రాలేదు. 2022 వేలంలో తుషార్.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఇదే రూ. 20 లక్షల ధరకు మారాడు. కానీ ఈ ఏడాది తుషార్ కు మంచి గుర్తింపు దక్కింది. ఈ సీజన్ లో తుషార్.. 16 మ్యాచ్ లు ఆడి 21 వికెట్లు తీసి చెన్నై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత క్రికెటర్లు వరుసగా పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్ పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా ఇటీవలే వివాహం చాప్టర్ ను పూర్తి చేశాడు. తాజాగా తుషార్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి సిద్ధమవుతున్నాడు. 

Scroll to load tweet…