ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబై చేతిలో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. 

ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబై చేతిలో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం కారణంగానే జట్టు ఓడిపోయిందని ఫైరయ్యాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చెత్త బ్యాటింగ్‌కు తోడు పిచ్ పరిస్ధితులకు అనుగుణంగా ఆడటంలో విఫలమయ్యామని ధోని పేర్కొన్నాడు. రెండో క్వాలిఫైయిర్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలంటే చెన్నై బ్యాటింగ్ మరింత మెరుగుపడాల్సిందేనన్నాడు.

తమ జట్టులో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఉన్నారని.. ఇప్పటి వరకు వీరి మీదే ఆధారపడుతూ వచ్చామన్నాడు. అయితే పరిస్ధితులు ఇంకా బాగా అర్ధం చేసుకుని ఉండాల్సిందని మహీ అభిప్రాయపడ్డాడు.

131 పరుగులు చాలా తక్కువ స్కోరని.. దీనికి తోడు ఫీల్డింగ్ తప్పిదాలు కూడా మ్యాచ్ కోల్పోయేలా చేశాయన్నాడు. అయితే తమకు ఫైనల్‌కు వెళ్లేందుకు ఇంకో అవకాశం ఉండటం ఆనందం కలిగిస్తోందని, ఈ మ్యాచ్‌లో రాణించి.. ఫైనల్‌కు వెళ్తామని మహేంద్ర సింగ్ ధోని ధీమా వ్యక్తం చేశాడు.