పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా.. జట్టు ఓడిపోయే స్థితిలో ఉన్నా ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా మహేంద్ర సింగ్ ధోని చాలా కూల్‌గా ఉంటాడు. ఆ ప్రశాంతతే ఆయనను టీమిండియా చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ను చేసింది.

కోపానికి దూరంగా ఉండే మహీ.. ఎవరి మీదా కోప్పడ్డట్టు మనం చూసింది తక్కువ. అలాంటి ధోనికి శనివారం జరిగిన మ్యాచ్‌లో చిర్రెత్తుకొచ్చింది. పంజాబ్ విజయానికి 12 బంతుల్లో 39 పరుగులు కావాల్సి ఉంది.

ఈ సమయంలో చెన్నై బౌలర్ దీపక్ చాహర్ రెండు నోబాల్స్ వేయడంతో ప్రత్యర్థికి రెండు ఫ్రీ హిట్స్ వచ్చాయి. దీంతో చాహర్ వద్దకు వచ్చిన ధోని తొలుత కోప్పడ్డాడు. తర్వాత పరిస్థితిని చాహర్‌కు వివరించాడు.

ధోని సలహా తర్వాత చాహర్ వేసిన ఆఖరు బంతికి కీలక బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ ఔటయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ .. పంజాబ్‌పై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.