Asianet News TeluguAsianet News Telugu

హర్భజన్ ఖాతాలో సరికొత్త ఐపిఎల్ రికార్డు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇండియన్ బౌలర్ హర్భజన్ సింగ్ అద్భుత  బౌలర్ గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇలా ఈ మెగా లీగ్ ఆరంభం నుండి ముంబై ఇండియన్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన హర్భజన్ సీజన్ 12లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడాడు. అయితే  తాను  కేవలం జట్టు మాత్రమే మారానని...ఆటతీరు మార్చుకోలేదని అతడు నిరూపించుకున్నాడు. ఇలా ఐపిఎల్ ఆరంభం నుండి తన స్పిన్ మాయాజాలంతో అదరగొడుతున్న హర్భజన్ ఈ లీగ్ హిస్టరీలో నిలిచిపోయేలా ఓ అరుదైన ఘనతను సాధించాడు.  

csk bowler harbhajan singh ipl record
Author
Vizag, First Published May 11, 2019, 2:48 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇండియన్ బౌలర్ హర్భజన్ సింగ్ అద్భుత  బౌలర్ గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇలా ఈ మెగా లీగ్ ఆరంభం నుండి ముంబై ఇండియన్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన హర్భజన్ సీజన్ 12లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడాడు. అయితే  తాను  కేవలం జట్టు మాత్రమే మారానని...ఆటతీరు మార్చుకోలేదని అతడు నిరూపించుకున్నాడు. ఇలా ఐపిఎల్ ఆరంభం నుండి తన స్పిన్ మాయాజాలంతో అదరగొడుతున్న హర్భజన్ ఈ లీగ్ హిస్టరీలో నిలిచిపోయేలా ఓ అరుదైన ఘనతను సాధించాడు.  

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 150 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్ గా హర్భజన్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఐపిఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానాన్ని ఆక్రమించాడు. గతంలో ముంబై ఇండియన్స్, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి తీసిన వికెట్ల ద్వారా అతడీ రికార్డును సాధించాడు. 

విశాఖ వేదికగా ఐపిఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై తలపడి గెలిచిన విషయం తెలిసిందే. ఇలా కీలకమైన మ్యాచ్ లో చెన్నై గెలుపుకోసం హర్భజన్ తనవంతు  పాత్ర పోషించాడు. ఇలా డిల్లీ బ్యాట్ మెన్ రూథర్ ఫర్డ్ ను ఔట్ చేయడం ద్వారా హర్భజన్ 150 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇలా జట్టును గెలిపించి ఫైనల్ కు చేర్చడంతో పాటు తన ఖాతాలోనూ  హర్భజన్ ఈ  అరుదైన  రికార్డు వేసుకున్నాడు. 

ఇప్పటివరకు జరిగిన ఐపిఎల్ 12 సీజన్లలో అత్యధిక వికెట్ల రికార్డు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ్ పేరిట వుంది. అతడు 169  వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా ఇండియన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 156 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత 150 వికెట్లు సాధించిన ఘనత హర్భజన్, పియూష్ చావ్లా పేరిట వుంది. ఈ సీజన్లో చెన్నై ఇంకా ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి వుంది. అందులో హర్భజన్ ఆడితే   చావ్లాను అధిగమించే అవకాశాలున్నాయి. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 10 మ్యాచులాడిన హర్భజన్ 16 వికెట్లు తీసి  రాణించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios