వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2020 సీజన్‌కి దూరంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, ‘చిన్న తల’ సురేశ్ రైనా అరెస్ట్ అయ్యాడు. ముంబై ఎయిర్‌పోర్టుకి సమీపంలోకి ముంబై డ్రాగన్ ఫ్లై క్లబ్‌లో జరిగిన రైడ్స్‌లో క్రికెటర్ సురేశ్ రైనాతో పాటు సింగర్ గురు రంధవాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ రైడ్‌లో ఏడు క్లబ్ స్టాఫ్ మెంబర్లతో పాటు 34 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోవిద్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలతో వీరిని అరెస్టు చేశారు పోలీసులు.

కరోనా నిబంధనలు పాటించకపోవడంతో అరెస్టు అయిన క్రికెటర్ సురేశ్ రైనా మరియు సింగర్ గురు రంధవాలను బెయిల్ మీద విడుదల చేసినట్టు తెలిపారు ఎస్‌ఆర్ పీ సహర్ పోలీస్ స్టేషన్ అధికారులు.