2019 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ హ్యాట్రిక్ తీసిన శ్రేయాస్ గోపాల్... విరాట్ కోహ్లీతో పాటు ఏబీ డివిల్లియర్స్, స్టోయినిస్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చిన శ్రేయాస్...

ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో శ్రేయాస్ గోపాల్ ఒకడు. ఐపీఎల్ హ్యాట్రిక్ తీసిన అతికొద్దిమందిలో ఒకడైన శ్రేయాస్ గోపాల్.. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు శ్రేయాస్ గోపాల్. నిన్న తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు నిఖిత శివ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శ్రేయాస్ గోపాల్, తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆ ఫోటోలను పంచుకున్నాడు.

‘గడిచిన కాలం నువ్వు లేకుండా ఒకేలా ఉండదు. నీతో గడపబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్నా. నీతో కలిసి జీవించడానికి ఎదురుచూడకుండా ఉండలేకపోతున్నా... మనకి ఛీర్స్...’ అంటూ ట్వీట్ చేశాడు శ్రేయాస్ గోపాల్...

Scroll to load tweet…

అండర్-13, అండర్15, అండర్16, అండర్-19 టోర్నీల్లో కర్ణాటక జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ గోపాల్, దేశవాళీ క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 2014 నుంచి 2017 వరకూ ఆడిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కి మారాడు.

రాజస్థాన్ రాయల్స్ తరుపున శ్రేయాస్ గోపాల్... 2019 సీజన్‌లో ఆర్‌సీబీపై హ్యాట్రిక్ సాధించాడు. విరాట్ కోహ్లీ వికెట్ తీసిన శ్రేయాస్... ఆ తర్వాతి బంతుల్లోనే ఏబీ డివిల్లియర్స్, మార్కస్ స్టోయినిస్‌లను పెవిలియన్‌కి పంపాడు. ఎంగేజ్‌‌మెంట్ చేసుకున్న శ్రేయాస్ గోపాల్‌కి రాజస్థాన్ రాయల్స్ జట్టు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది.