ఐపీఎల్ 2020 సీజన్ నుంచి టి. నటరాజన్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. అనుకోకుండా భారత జట్టులో చోటు దక్కించుకున్న నటరాజన్... ఒకే టూర్‌లో వన్డే, టీ20, టెస్టు సిరీస్‌ల్లో ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచి, రికార్డు క్రియేట్ చేశాడు...

ఆఖరి వన్డేతో పాటు టీ20 సిరీస్‌లోనూ అదరగొట్టే పర్ఫామెన్స్ ఇచ్చిన నటరాజన్... విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆఖరి టెస్టులో ఎంట్రీ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన నటరాజన్‌కి స్వదేశంలో జీవితాంతం గుర్తిండిపోయే రేంజ్‌లో స్వాగతం లభించింది.

తమిళనాడులోని సేలం ఏరియాకి చెందిన నటరాజన్... పళని మురుగున్ స్వామి దేవాలయాన్ని సందర్శించుకుని, తలనీలాలు సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో నటరాజన్‌కి చోటు దక్కలేదు. అయితే వన్డే, టీ20 సిరీస్‌లో నట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.