టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అతని గర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టి ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అతియా అద్దం ముందు స్విమ్ సూట్‌లో అద్దం ముందు సెల్ఫీ దిగిన ఫోటోను షేర్ చేసింది.

ఈ ఫోటోలో ఆమె తన స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొట్టారు. ఈ పోస్టుపై రాహుల్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతియా పోస్టుపై స్పందిస్తూ.. ‘ జెఫా ’ అని కామెంట్ చేశాడు.

అయితే చాలా మందికి జెఫా అంటే అర్థం తెలియక ఆశ్చర్యపోతున్నారు. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ ఓ నెటిజన్ దానికి అర్థం చెప్పాడు. ‘‘జెఫా’’ అంటే స్పానిస్ భాషలో ‘‘ బాస్ ’’అని తెలిపాడు.

తాజాగా అతియా తన తల్లి మనా శెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్ట్ మరోసారి ట్రెండింగ్ అయ్యింది. ‘‘ పదాలు ఎప్పుడూ న్యాయం చేయలేవని.. నా మనసుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యూ మమా’’ అంటూ ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

దీంతో ఈ పోస్ట్‌కి రాహుల్ ఎలా స్పందిస్తాడా అని నెటిజన్లు ఆతృతగా ఎదురుచూశారు. అయితే కేఎల్ రాహుల్ చాలా సింపుల్‌గా ‘‘ హార్ట్ ఏమోజీ’’ని పోస్ట్ చేశాడు. కాగా అతియా, కేఎల్‌ రాహుల్‌ ఏడాది నుంచి డేటింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ జంట ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఈ విషయంపై వీరు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వారిద్దరి సోషల్​మీడియా పోస్టులు మాత్రం తరచూ వైరల్​ అవుతున్నాయి.

ఇటీవలే రాహుల్​ పుట్టినరోజు సందర్భంగా అతియా శుభాకాంక్షలు తెలుపుతూ ‘అతను నా వ్యక్తి’ అని సోషల్‌ మీడియాలో పేర్కొంది. ఇద్దరు కలిసి తరచూ డిన్నర్‌లు, పార్టీలకు హాజరు అవుతున్నారు

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

no words could ever do justice...happy birthday to my whole ♥️. i love you, mama.

A post shared by Athiya Shetty (@athiyashetty) on Aug 21, 2020 at 11:11pm PDT