ఐపీఎల్ 2021 సీజన్‌ మినీ వేలానికి భజ్జీని విడుదల చేసిన సీఎస్‌కే...చపాతీలు చేస్తున్న వీడియోను షేర్ చేసిన హర్భజన్ సింగ్...చపాతీలు చుట్టడం రాకపోతే జీవితం వృథా అంటూ పంజాబీ సామెత...

టీమిండియా క్రికెటర్లలో హర్భజన్ సింగ్ యాటిట్యూడ్ చాలా ప్రత్యేకం. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా ఏ మాత్రం ఆపుకోలేడు భజ్జీ. 40 ఏళ్లు దాటినా ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలకని ఈ సీనియర్ స్పిన్నర్.. భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని బలంగా ఆశపడుతున్నాడు.

టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు పడగొట్టిన హర్భజన్ సింగ్... ఐపీఎల్‌లో 150 వికెట్లు తీశాడు. 2021 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి విడుదల చేయబడిన హర్భజన్ సింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చపాతీలు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు.. ‘ప్రపంచం మొత్తం చుట్టి వచ్చినా, చపాతీలు చుట్టడం రాకపోతే ఆ జీవితం వృథా...’ అనే అర్థంలో ఓ పంజాబీ సామెతను పోస్టు చేశాడు భజ్జీ.

View post on Instagram

దానికి మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్... ‘వా... పాజీ వా...’ అంటూ కామెంట్ చేశాడు. 37 ఏళ్ల మునాఫ్ పటేల్, 2011లో టీమిండియా వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో శ్రీశాంత్‌ను చెంప దెబ్బ కొట్టడం, ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌తో ‘మంకీ గేట్’ వివాదాల్లో భజ్జీ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.