Asianet News TeluguAsianet News Telugu

క్రికెటర్ దినేశ్ కార్తీక్‌కి డబుల్ హ్యాపీనెస్... కవల పిల్లలకు జన్మనిచ్చిన దీపికా పల్లికల్...

క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇంట్లో డబుల్ హ్యాపీనెస్.. కవల మగ పిల్లలకు జన్మనిచ్చిన స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్...

Cricketer Dinesh Karthik wife squash player Deepika Pallikal blessed with twin boys
Author
India, First Published Oct 28, 2021, 7:37 PM IST

భారత క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, కామెంటేటర్ దినేశ్ కార్తీక్ తన అభిమానులకు శుభవార్త తెలియచేశాడు. దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారీ క్రీడా జంట.

‘ఇంతకుముందు ముగ్గురం, ఇప్పుడు ఐదుగురం అయ్యాం. దీపికా ఇద్దరు అందమైన మగ పిల్లలకు జన్మనిచ్చింది... కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్... ఇంతకుమించిన సంతోషం ఏముంటుంది...’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు దినేశ్ కార్తీక్... తమ పెంపుడు కుక్కని కూడా తమ కుటుంబంలో సభ్యుడిగా కలుపుకుని ముగ్గురిగా అభివర్ణించారు ఈ ఇద్దరూ...

తమిళనాడు రాష్ట్రానికి చెందిన దినేశ్ కార్తీక్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటే 2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది కెప్టెన్‌గా తమిళనాడుకి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీని అందించిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ పైనల్ చేరడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు...
 

2004లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన దినేశ్ కార్తీక్, 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20 మ్యాచులు ఆడాడు. ఓవరాల్‌గా దాదాపు 2200 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్‌లో ఏడు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించక ముందే కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్, తనదైన చమత్కారంతో ఫుల్లు మార్కులు కొట్టేశాడు.

కామెంటేటర్‌గా ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌తో పాటు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్, బిగ్‌బాష్ లీగ్‌లకు వ్యాఖ్యానం చెప్పాడు దినేశ్ కార్తీక్... తొలుత 2007లో నిఖితా వంజరను పెళ్లాడాడు దినేశ్ కార్తీక్. అయితే మురళీ విజయ్‌తో నిఖిత వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న దినేశ్ కార్తీక్, 2012లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. 2015లో భారత స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను ప్రేమించి పెళ్లాడాడు దినేశ్ కార్తీక్...

స్వ్కాష్ ప్లేయర్‌గా 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్‌లో స్వర్ణం గెలిచిన దీపికా పల్లికల్, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం గెలిచింది. 2014 ఏషియన్ గేమ్స్‌లో రజతం గెలిచిన దీపికా పల్లికల్, 2010 టీమ్ ఈవెంట్, 2014 సింగిల్స్, 2018 సింగిల్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. 

ప్రొఫెషనల్ స్వ్కాష్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ప్రవేశించిన మొట్టమొదటి భారత స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది దీపికా పిల్లకల్...  2012లో అర్జున అవార్డు పొందిన దీపికా పల్లికల్, 2014లో పద్మశ్రీను అందుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios