ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ‘డాన్’ బ్రాడ్‌మెన్ ఇష్టంగా ఓ గ్రీన్ కలర్ టోపీని ధరించేవాడు. టెస్టుల్లో ప్రత్యేకంగా ధరించే ఈ టోపీని వేలం వేయగా..  34000 డాలర్లకు అంటే అక్షరాల 2 కోట్ల 51 లక్షల 93 వేల రూపాయలకు పైగా ధర పలికింది. ఓ క్రికెట్ వస్తువుకి వేలంలో ఇంత ధర పలకడం క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి.  

అత్యధిక ధర పలికిన రెండో క్రికెట్ సంబంధిత వస్తువుగా రికార్డు క్రియేట్ చేసింది డాన్ టోపీ. 1928లో టెస్టు క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో సర్ డాన్ బ్రాడ్‌మన్ ధరించిన టోపీ ఇది. రోడ్ మైక్రోఫోన్స్ వ్యవస్థాపకుడు పీటర్ ఫ్రీడ్‌మన్ భారీ మొత్తం చెల్లించి, బ్రాడ్‌మన్ టోపీకి దక్కించుకున్నాడు. 

ఇంతకుముందు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ వాడిన క్యాప్‌కి వేలంలో 7,60,000 అమెరికన్ డాలర్లు (దాదాపు 5 కోట్ల 61 లక్షలకు పైగా) ధర లభించింది. షేన్ వార్న్ టోపీ తర్వాత బ్రాడ్‌మన్ టోపీకి వచ్చిన ధరే అత్యధికం.