ఐపిఎల్ సీజన్ 12 లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోయి టైటిల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడ్డ ముంబై కేవలం ఒకే ఒక పరుగు తేడాతో గెలిచింది. 150 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో వాట్సన్(80 పరుగులు) ధాటిగా ఆడటంతో చివరివరకు మ్యాచ్ చెన్నై వైపే నిలిచింది. కానీ చివరి రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చి అనూహ్యంగా ముంబైని విజేతగా నిలబెట్టాయి.

అయితే ఈ మ్యాచ్ లో కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ముంబై ఇండియన్స్ వైపే వుండటం... చివరకు అదే జట్టు విజయాన్ని అందుకోవడంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ మ్యాచ్ ఫిక్స్ అయి వుంటుందని...అందువల్లే అన్ని పరిణామాలు ముంబైకి అనుకూలంగానే జరిగాయని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.
మ్యాచ్ పిక్సింగ్ పై అభిమానులు, నెటిజన్ల అనుమానాలివే:
ఈ మ్యాచ్ లో చెన్నై గెలుపువైపు సాగుతున్న సమయంలో కెప్టెన్ ధోని అనూహ్యంగా రనౌటయ్యాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంలో ధోని దిట్ట. అలాంటిది అతడు రనౌటవడం పలు అనుమాలకు కారణమవుతోంది. అంతేకాకుండా అతడి రనౌట్ పై క్లారిటీ రాకపోయినా అంపైర్లు అతన్ని ఔట్ గా ప్రకటించారు. ఇది కూడా కాంట్రవర్సీగా మారింది.
ఇక అభిమానులు వ్యక్తపరుస్తున్న మరో అనుమానం...షేన్ వాట్సన్ రనౌట్. వాట్సన్ రనౌటయినట్లు కేవలం లైవ్ లో మాత్రమే చూయించారు. మ్యాచ్ ను మలుపుతిప్పిన ఈ రనౌట్ ను ఒక్కసారి కూడా రిప్లేలో చూయించలేదు. దీంతో వాట్సన్ ఎలా రనౌటయ్యాడన్న దానిపై కూడా అభిమానులకు క్లారిటీ రాకపోవడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు.
అలాగే ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ కొన్ని అనుమానాస్పద సంఘటనలు చోటుచేసుకున్నాయి. మంచి ఫీల్డర్ గా పేరున్న సురేశ్ రైనా కీలక సమయంలో హార్దిక్ పాండ్యా క్యాచ్ ను జారవిడిచాడు. సింపుల్ క్యాచ్ ను రైనా చేజేతులా వదిలేయడం అనుమానాన్ని కలిగిస్తోంది.
అంతేకాకుండా చెన్నై బ్యాట్ మెన్స్ కొందరు అనూహ్యంగా ఔటయ్యారు. అలాగే కొన్ని క్యాచులు మిస్ చేయడం... మిస్ ఫీల్డింగ్ లతో అనవసర పరుగులు సమర్పించుకోవడం అభిమానుల్లో మ్యాచ్ పిక్సింగ్ అనుమానాలను కలిగిస్తోంది.