Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్ ప్రపంచంలో విషాదం.... ‘క్రికెట్ ద్రోణ’ వసో పరన్‌జపే కన్నుమూత...

82 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన  ‘క్రికెట్ ద్రోణ’ మాజీ ముంబై క్రికెటర్, ఎన్‌సీఏ కోచ్ వసో పరన్‌‌జపే...  సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి ఎందరో క్రికెటర్లకు మెంటర్‌గా వసో...

Cricket Drona Vasoo Paranjape Passed away, who is mentor for many Indian Cricketers
Author
India, First Published Aug 30, 2021, 4:28 PM IST

క్రికెట్ ప్రపంచంలో విషాదం అలుముకుంది. ‘క్రికెట్ ద్రోణ’గా గుర్తింపు పొందిన మాజీ ముంబై క్రికెటర్, ఎన్‌సీఏ కోచ్ వసో పరన్‌‌జపే, తన 82 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. బరోడా, ముంబై తరుపున 29 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పరన్‌జపే, రిటైర్మెంట్ తర్వాత మెంటర్‌గా మారారు.

భారత క్రికెట్‌లో లెజెండ్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి ఎందరో క్రికెటర్లకు మెంటర్‌గా వ్యవహరించారు వసో... 14 ఏళ్ల రాహుల్ ద్రావిడ్‌ను చూసిన, ఈ కుర్రాడు టీమిండియాకి ఆడతాడని చెప్పిన వసో, సన్నీకి గురువుగా వ్యవహరించారు. 

వసో పరన్‌జపే జీవిత కథ ఆధారంగా ‘క్రికెట్ ద్రోణ: ఫర్ ది లవ్ ఆఫ్ వసో పరన్‌జపే’ అని పుస్తకం రచించారు ఆయన కుమారులు జతిన్ పరన్‌జపే, ఆనంద్ వసు. టీమిండియా తరుపున 4 వన్డేలు ఆడిన జతిన్ పరన్‌జపే, మోకాలి గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నారు. వసో పరన్‌జపే మృతిపై మాజీ క్రికెటర్లు, మాజీ కోచ్‌లు అనిల్ కుంబ్లే, డబ్ల్యూవీ రామన్ ట్వీట్ల ద్వారా సంతాపం ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios