ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ షాక్, ఆందోళనలో ఆటగాళ్లు!

ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ షాక్‌ ఇచ్చేటందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధమైంది. కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆదాయం భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. 

Cricket Australia Gives A huge Shock To Australian Cricketers, Players Express Displeasure

ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ షాక్‌ ఇచ్చేటందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధమైంది. కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆదాయం భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. 

ఆ దెబ్బను పూడ్చుకునేందుకు ఈ ఏడాది ఆఖర్లో భారత్‌తో సిరీస్‌ ద్వారా సుమారు 2000 కోట్ల ఆదాయం దక్కించుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సమాయత్తమవుతున్నప్పటికీ.... 2020-21 వార్షిక ఆదాయాన్ని సీఏ( క్రికెట్ ఆస్ట్రేలియా) తాజాగా చాలా తక్కువ చేసి అంచనాలను రూపొందించింది. 

ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘంతో సీఏ గతేడాది ఓ ఒప్పందం చేసుకుంది. సీఏ వార్షిక ఆదాయంలో 27.5 శాతం ఆటగాళ్లకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఇప్పుడు ఆదాయ అంచనాలను 40-50 శాతం కుదించటంతో క్రికెటర్ల వాటా కూడా భారీగా పడిపోనుంది. 

దీంతో వార్షిక కాంట్రాక్టుల్లో 25-30 శాతం కోత విధించే ప్రమాదం కనిపిస్తోంది. సీఏ ఆదాయ అంచనాలపై ఏసీఏ(ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్) మండిపడింది. ఏ కొలమానాలతో ఆదాయ అంచనాలను భారీగా కుదించారో తెలపాలని డిమాండ్‌ చేసింది. వాస్తవిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మరోసారి అంచనాలు రూపొందించాలని సీఏను క్రికెటర్ల సంఘం కోరింది.

ఇకపోతే ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ వాయిదా, దాదాపుగా ఖాయంగా కనబడుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ వాయిదా అనివార్యంగా కనబడుతుంది. దీనిపై ఐసీసీ ఇంకా అధికారికంగా ఐసీసీ ప్రకటన చేయకున్నప్పటికీ... కరోనా వైరస్ నేపథ్యంలో ఇది ఖాయంగా కనబడుతుంది. 

టి20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేయాలని చాలాదేశాల క్రికెట్‌బోర్డులు ఐసీసీిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌-19 కారణంగా అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు భారీ నష్టాల్లో కూరుకుపోయి, ఆటగాళ్లకు కనీసం జీతాలు చెల్లించలేకపోతున్న విషయం తెలిసిందే. 

అలా జరిగితే క్రికెట్‌ సీజన్‌ ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌(ఐపీఎల్‌)తో ప్రారంభమైతే అన్ని బోర్డులు ఆర్థికంగా పుంజుకొనే అవకాశముందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. 

అక్టోబర్‌-నవంబర్‌లో ఐపీఎల్‌ నిర్వహిస్తే ఆటగాళ్లతోపాటు అన్ని దేశాల క్రికెట్‌బోర్డులు ఆర్థికంగా పుంజుకుంటాయని వారు అంటున్నారు. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ.. ఐసీసీ ప్రకటన అనంతరమే ఐపీఎల్‌ సీజన్‌-13పై తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios