ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని యువత వెర్రివేషాలకు అద్దూ అదుపు లేకుండా పోతుంది.  పబ్జీ వంటి ఆన్‌లైన్ గేమ్స్ మాయలో పడి కేవలం యువతే కాదు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గతంలో ఐస్ బకెట్, కికి వంటి విచిత్రమైన ఛాలెంజ్ ల మూలంగా కూడా చాలామంది బాధితులుగా మారినవారున్నారు. వీటన్నింటి చూస్తూ కూడా రోజుకో తరహా పనికిమాలిన ఛాలెంజ్ లు పుట్టుకొస్తున్నాయి. అలా పుట్టుకొచ్చి ప్రపంచ  వ్యాప్తంగా పాపులర్ అయింది ''కౌ కిస్సింగ్ ఛాలెంజ్ (ఆవును ముద్దుపెట్టుకునే ఛాలెంజ్)''. 

మన ఇండియాలో ఇంకా అంత ఫాపులక్ కాకపోయినా విదేశాల్లో మాత్రం ఈ ఛాలెంజ్ ఓ ఊపు ఊపేస్తోంది. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో అయితే నెటిజన్లు ఈ ఛాలెంజ్ ను విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఆవును ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసుకుని దాన్ని  #cowkissing హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. అంతేకాదు ఆ తమ స్నేహితులకు ఈ ఛాలెంజ్ విసరవచ్చు.  ఇలా కౌ కిస్సింగ్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో వుంది. 

అయితే ఇలా ఆవులను కిస్ చేయడానికి ప్రయత్నిస్తూ చాలా మంది ప్రమాదానికి గురవుతున్నారు. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం ఈ ఛాలెంజ్ పేరుతో ప్రాణాలను బలితీసుకోవద్దని తమ పౌరులకు హెచ్చరిస్తోంది. అలాగే ప్రభుత్వం తరపున కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోడానికి సిద్దమవుతోంది. 

ఇలాంటి ఛాలెంజ్ లు సరదాగానే వున్నా చాలా ప్రమాదకరమైనవి. మన ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు. కాబట్టి కొద్ది క్షణాల మన ఆనందం కోసం కుటుంబ సభ్యులను జీవితాంతం బాధపెట్టడం ఎంతవరకు సమంజసం. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన ఛాలెంజ్ లకు, వింత చేష్టలకు,  ఆన్ లైన్ గేమింగ్స్ కు దూరంగా వుండండి. కుటుంబంతో కలిసి హాయిగా జీవించండి.