Asianet News TeluguAsianet News Telugu

సిరాజ్ పై రేసిజం కామెంట్స్... క్రికెట్ ఆస్ట్రేలియా ఏమందంటే...

మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేసిన అనంతరం బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసేందుకు వెళ్లగా.. అతనిపై స్టేడియంలో కూర్చొని రేసిజమ్ కామెంట్స్ చేశారు.
 

Could not Find Those Who Racially Abused Indian Players, Says Cricket Australia: Report
Author
Hyderabad, First Published Jan 27, 2021, 10:29 AM IST

టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ పై ఆస్ట్రేలియన్ అభిమానులు  జాత్యాహంకార కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. ఆస్ట్రేలియా అభిమానులను తాము గుర్తించలేకపోయామని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చిచెప్పేయడం గమనార్హం.

ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా  మూడో టెస్టు మ్యాచ్ జరగగా..మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేసిన అనంతరం బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసేందుకు వెళ్లగా.. అతనిపై స్టేడియంలో కూర్చొని రేసిజమ్ కామెంట్స్ చేశారు.

దాంతో.. సిరాజ్ కెప్టెన్ అజింక్య రహానెకి విషయం చెప్పగా.. ఫీల్డ్ అంపైర్లకి అతను ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ ఆరుగుర్ని స్టేడియం నుంచి వెలుపలికి పంపించేశారు.

సిరాజ్‌పై జాత్యాహంకార వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 14 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ని కోరింది. వెంటనే దిద్దుబాటు చర్యలకి దిగిన సీఏ.. ఆ అభిమానుల తరఫున బహిరంగ క్షమాపణలు కోరింది. ఆ తర్వాత విచారణ జరిపినప్పటికీ తాము ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల్ని గుర్తించలేకపోయామని తాజాగా ఐసీసీకి రిపోర్ట్‌ సమర్పించినట్లు తెలుస్తోంది. 

అయితే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ఆ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి ఉండటంతో.. న్యూ సౌత్ వేల్స్ (ఎన్‌ఎస్ డబ్ల్యూ) పోలీస్ ఫోర్స్ విచారణని కొనసాగిస్తోంది. దాంతో.. ఎన్‌ఎస్ డబ్ల్యూ రిపోర్ట్ తర్వాత ఐసీసీ అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.

సీఏ రిపోర్ట్ సమర్పించిన తర్వాత ఆస్ట్రేలియా మీడియా భిన్నమైన కథనాల్ని ప్రచురిస్తోంది. సిడ్నీలో ఆ ఆరుగురు సిరాజ్‌పై జాత్యాంహకార వ్యాఖ్యలు చేయలేదని.. ఒకే ఓవర్‌లో సిరాజ్ రెండు సిక్సర్లు సమర్పించుకోవడంతో.. వెల్‌కమ్ టు సిడ్నీ సిరాజ్ అని మాత్రమే గట్టిగా అరిచినట్లు ఆ కథనంలో పేర్కొనడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios