చెన్నై, మొతేరాలో ఎదురైన ఘోర పరాజయానికి  స్పిన్ పిచ్‌లే కారణమంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్న ఇంగ్లాండ్ జట్టుకి, ఆ జట్టు ప్లేయరైన పేసర్ జోఫ్రా ఆర్చర్ షాకింగ్ కౌంటర్ ఇచ్చాడు. 
డైలీ మెయిల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జోఫ్రా ఆర్చర్, పిచ్‌పై వస్తున్న విమర్శల గురించి షాకింగ్ సమాధానాలు ఇచ్చాడు.

‘మనం ఎలాంటి పిచ్‌మీద ఆడుతున్నామనేది అసలు సంబంధం లేని విషయం. పిచ్ బాలేదని చెప్పడం, వైఫ్ స్పీడ్ బాలేదని కంప్లైంట్ ఇవ్వడంతో సమానం. మూడేళ్ల క్రితం గ్లామోర్గన్‌తో జరిగిన డే నైట్ టెస్టు కేవలం ఐదు సెషన్లలోనే ముగిసింది. ఇండియాలోనే కాదు, ఇంగ్లాండ్‌లో కూడా మ్యాచులు చాలా త్వరగా అయిపోయాయి...’ అంటూ వ్యాఖ్యానించాడు జోఫ్రా ఆర్చర్.

పిచ్‌పై తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌, కోచ్ అండ్ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లకు జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన సమాధానంతో స్ట్రాంగ్ కౌంటర్ పడినట్లైంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్, మైఖేల్ వాన్ వంటి వాళ్లు మొతేరా పిచ్‌ టెస్టులకు పనికి రాదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.