ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను అవుట్ చేసిన మహ్మద్ సిరాజ్...క్రీజులోకి వస్తూనే సిరాజ్‌పై నోరుపారేసుకున్న బెన్ స్టోక్స్...మధ్యలో కలగచేసుకున్న విరాట్ కోహ్లీ... కోహ్లీ, బెన్ స్టోక్స్ మధ్య మినీ మాటల యుద్ధం...
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్‌కి నోటి దురద కాస్త ఎక్కువనే విషయం తెలిసిందే. రెండో టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సైగలతో అతన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించాడు బెన్ స్టోక్స్.
తాజాగా నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జో రూట్‌ను పెవిలియన్ చేర్చిన భారత బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై కూడా ఇలాగే నోరుపారేసుకున్నాడు బెన్ స్టోక్స్.. జో రూట్‌ను అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్‌కు సిరాజ్ బౌన్సర్‌తో స్వాగతం పలికాదు.
దీంతో సిరాజ్‌ను బెన్ స్టోక్స్ ఏదో అనడం, వారిద్దరి మధ్య మాటామాటా పెరుగుతుండడంతో భారత సారథి విరాట్ కోహ్లీ రంగంలోకి దిగాడు. మహ్మద్ సిరాజ్‌ను సపోర్టు చేస్తూ బెన్ స్టోక్స్‌తో వాదించాడు. ఈ ఇద్దరి మధ్య మాటా మాటా పెరుగుతుండడంతో అంపైర్లు కలగచేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
