జమైకా దేశానికి కరోనా వ్యాక్సిన్‌ను పంపించిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ కృతజ్ఞతలు తెలిపాడు. కరోనా నియంత్రణ కోసం 50 వేల కోవిద్-19 వ్యాక్సిన్‌లను జమైకాకి పంపించింది భారత ప్రభుత్వం.

ఈ సాయంపై వీడియో సందేశం ద్వారా స్పందించిన క్రిస్‌గేల్... ‘గౌరవనీయులైన భారత ప్రధానికి, భారత ప్రజలకు, ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. జమైకాకి కరోనా వ్యాక్సిన్‌ను విరాళంగా ఇవ్వడాన్ని మేం ఎప్పుడూ మరిచిపోం... త్వరలోనే ఇండియాకి వస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడబోతున్నాడు క్రిస్‌గేల్.