Asianet News TeluguAsianet News Telugu

పక్షవాతానికి గురైన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్

ఈ స‌ర్జ‌రీ సంద‌ర్భంగా స్ట్రోక్ రావ‌డంతో కెయిన్స్ ప‌క్ష‌వాతానికి గుర‌య్యాడు. మేజ‌ర్ స‌ర్జ‌రీ త‌ర్వాత అత‌డు తొలిసారి ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

Chris Cairns, Paralysed After Stroke During Surgery, Shares Video Message
Author
Hyderabad, First Published Sep 20, 2021, 11:47 AM IST

ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న  న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ అనారోగ్యానికి గురయ్యారు.  ఆయన కు ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల ఆయన పక్షవాతానికి గురయ్యారు. నడవలేని దీనస్థితిలో చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు.

గుండె నాళాల్లో చీలిక ఏర్ప‌డ‌టంతో సిడ్నీలోని డాక్ట‌ర్లు అత‌నికి స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. అయితే ఈ స‌ర్జ‌రీ సంద‌ర్భంగా స్ట్రోక్ రావ‌డంతో కెయిన్స్ ప‌క్ష‌వాతానికి గుర‌య్యాడు. మేజ‌ర్ స‌ర్జ‌రీ త‌ర్వాత అత‌డు తొలిసారి ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

తన‌ ప్రాణాలు కాపాడినందుకు డాక్ట‌ర్లకు, త‌న కోసం ప్రార్థించిన అభిమానుల‌కు థ్యాంక్స్  చెప్పారు. రానున్న కాలంలో త‌న జీవితంలోనే అతి పెద్ద స‌వాలును ఎదుర్కోబోతున్న‌ట్లు అత‌డు వీడియో సందేశంలో చెప్పారు..

న్యూజిలాండ్ త‌ర‌ఫున 1989 నుంచి 2004 మ‌ధ్య ఆడిన కెయిన్స్ 62 టెస్టుల్లో ప్రాతినిధ్యం వ‌హించాడు. బౌలింగ్ లో 29.4 సగటు, బ్యాటింగ్లో 33.53 సగటు సాధించాడు. ఇందులో 87 సిక్సర్లు ఉన్నాయి. ఆ సమయంలో అదో ప్రపంచ రికార్డు కావడం గమనార్హం.
 

Follow Us:
Download App:
  • android
  • ios