Asianet News TeluguAsianet News Telugu

75 బంతుల్లో సెంచరీ బాదేసిన ఛతేశ్వర్ పూజారా... ఇలా ఆడితే వన్డే టీమ్‌లో రీఎంట్రీ ఖాయం..

మిడిల్‌సెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 90 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... రాయల్ లండన్ కప్‌లో భీకర ఫామ్... 

Cheteshwar Pujara smashed another Century in Royal London ODI Cup in just 75 balls
Author
India, First Published Aug 23, 2022, 7:23 PM IST

టెస్టు స్పెషలిస్టు ప్లేయర్, జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లను విసిగించే ఛతేశ్వర్ పూజారా... రాయల్ లండన్ వన్డే కప్‌లో విశ్వరూపమే చూపిస్తున్నాడు. అసలు ఆడేది పూజారాయేనా... అని డౌట్ వచ్చేలా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో టీమిండియా ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు... వార్‌విక్‌షైర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో సెంచరీ చేసిన పూజారా, సుర్రేతో జరిగిన మ్యాచ్‌లో 174 పరుగులు చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు...

తాజాగా మిడిల్‌సెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సెంచరీతో చెలరేగిపోయాడు ఛతేశ్వర్ పూజారా. 75 బంతుల్లో సెంచరీ అందుకున్న ఛతేశ్వర్ పూజారా, 90 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో ఛతేశ్వర్ పూజారా ఇప్పటిదాకా 614 పరుగులు చేశాడు...

రాయల్ లండన్ వన్డే కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా ఉన్నాడు ఛతేశ్వర్ పూజారా.  మిడిల్ సెక్స్ స్టీఫెన్ ఎస్కీనజీ 645 పరుగులతో టాప్‌లో ఉంటే, పూజారా రెండో స్థానంలో ఉన్నాడు. 2022లో 500+ పరుగులు చేసిన బ్యాటర్లు ఈ ఇద్దరే కావడం విశేషం.

ఛతేశ్వర్ పూజారాతో పాటు సుసెక్స్ ఓపెనర్ టామ్ అల్సాప్ 155 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 189 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 400 పరుగుల భారీ స్కోరు చేసింది సుసెక్స్ క్లబ్. రాయల్ లండన్ వన్డే కప్‌లో సుసెక్స్ క్లబ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఛతేశ్వర్ పూజారా.. నేటి ఇన్నింగ్స్ చివరి 26 బంతుల్లో 62 పరుగులు చేయడం విశేషం...

2020-21 ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఛతేశ్వర్ పూజారా, గత కొన్నేళ్లుగా టెస్టుల్లో సిక్సర్ కొట్టలేదు. ఇదే కాన్ఫిడెన్స్‌తో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పూజారా ఒక్క సిక్స్ కొడితే తాను అరగుండు, అరమీసంతో కనిపిస్తానని ఛాలెంజ్ చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్...

అశ్విన్ అంచనా వేసినట్టే స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు ఛతేశ్వర్ పూజారా. అలాంటి పూజారా... రాయల్ లండన్ వన్డే కప్‌లో ఇప్పటిదాకా 11 సిక్సర్లు బాదడం, టీమిండియా ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేస్తోంది...

116.28 స్ట్రైయిక్ రేటుతో, 102.3 యావరేజ్‌తో పరుగులు చేస్తున్న ఛతేశ్వర్ పూజారా... భారత జట్టు వన్డే టీమ్‌లో ప్లేస్ కొట్టేయడం ఖాయమంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. ప్రస్తుతం వన్డే టీమ్‌లో ఉన్న చాలామంది ప్లేయర్ల కంటే ఛతేశ్వర్ పూజారా చాలా బెటర్‌గా ఆడుతున్నాడని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

జింబాబ్వే టూర్‌లో వన్డేల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌ల కంటే ఇంగ్లాండ్ కౌంటీ బౌలర్లను ఎదుర్కొంటూ 100+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారాకి వన్డే టీమ్‌లో చోటు ఇవ్వడం న్యాయమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

Follow Us:
Download App:
  • android
  • ios