Asianet News TeluguAsianet News Telugu

పవర్ ఫుల్ షాట్ తో అంపైర్ ని భయపెట్టిన పూజారా..!

పూజారా నిలపడి.. జట్టు పరువు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో.. పూజారా.. తన పవర్ ఫుల్ షాట్ తో.. ఏకంగా అంపైర్ ని భయపెట్టాడు. 

Cheteshwar Pujara gives umpire Richard Kettleborough a scare for his life with a sizzling pull shot
Author
Hyderabad, First Published Aug 28, 2021, 2:13 PM IST


టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం తలపడుతోంది.  ఈ టెస్ట్ సిరీస్ లో.. టీమిండియా తొలుత తడపడినా.. ఇప్పుడిప్పుడే కాస్త నిలదిక్కుకుంటోంది.  పూజారా నిలపడి.. జట్టు పరువు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో.. పూజారా.. తన పవర్ ఫుల్ షాట్ తో.. ఏకంగా అంపైర్ ని భయపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట  వైరల్ గా మారింది.

మూడో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ 79వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. మొయిన్‌ అలీ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతిని పుజారా స్వేర్‌ లెగ్‌ దిశగా  బౌండరీ కొట్టాడు. అయితే పుజారా బ్యాక్‌ఫుట్‌ తీసుకొని బంతిని బలంగా బాదడంతో సెకన్ల వ్యవధిలోనే బౌండరీ లైన్‌కు వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న లెగ్‌ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరో కిందకు వంగడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఒకవేళ అంపైర్‌ అలాగే నిల్చొని ఉంటే తల ఖాయంగా పగిలి ఉండేది. పుజారా కొట్టిన ఆ షాట్‌ గంటకు 98 కిమీ వేగంతో వెళ్లినట్లు తర్వాత మీటర్‌ రీడింగ్‌లో చూపించారు. దీంతో.. వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

 

ఇక పుజారా తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమే ఇచ్చాడు. 11 ఇన్నింగ్స్‌ల నుంచి కనీసం అర్థసెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయిన పుజారా కీలకదశలో రాణించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇ​న్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచినా పుజారా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనదైన మార్క్‌ చూపించాడు. ఓపెనర్‌ రాహుల్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా తన శైలికి భిన్నంగా వేగంగా ఆడుతూ 180 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. ఇందులో 15 ఫోర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్‌లో మూడోరోజు ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios