కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 టోర్నీలో మూడో డబుల్ సెంచరీ బాదిన ఛతేశ్వర్ పూజారా...
టీమిండియా తరుపున మూడేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్న ఛతేశ్వర్ పూజారా... కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 టోర్నీలో మాత్రం శతకాల మోత మోగిస్తున్నాడు. సుసెక్స్ క్లబ్ తరుపున ఇప్పటికే నాలుగు సెంచరీలు, అందులో రెండు డబుల్ సెంచరీలు బాదిన ఛతేశ్వర్ పూజారా... మిడిల్‌సెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కి తాత్కాలిక సారథిగా కూడా వ్యవహరిస్తున్నాడు...
కెప్టెన్సీ చేపట్టిన జోష్‌లో మరో డబుల్ సెంచరీ బాదేసి, 89 ఏళ్ల రికార్డును తిరగరాశాడు ఛతేశ్వర్ పూజారా. ఈ సీజన్‌లో డర్భీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారా, దుర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. గత 118 ఏళ్ల కౌంటీ చరిత్రలో సుసెక్స్ క్లబ్ తరుపున ఒకే సీజన్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు ఛతేశ్వర్ పూజారా...
ఇంతకుముందు 1933లో నవాబ్ ఆఫ్ పటౌడీ సీనియర్ (ఇఫ్తికర్ ఆలీ ఖాన్ పటౌడీ) కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మూడు డబుల్ సెంచరీలు బాదాడు. అయితే 1933లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకపోవడంతో పటౌడీ, బ్రిటీష్ క్రికెటర్‌గా ఈ ఫీట్ సాధించాడు. దీంతో కౌంటీ ఛాంపియన్‌షిప్ ఒకే ఎడిషన్‌లో మూడు డబుల్ సెంచరీలు బాదిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచాడు ఛతేశ్వర్ పూజారా...
అంతేకాకుండా గత 118 ఏళ్లలో సుసెక్స్ క్లబ్ తరుపున మూడు డబుల్ సెంచరీలు బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు ఛతేశ్వర్ పూజారా. ఛతేశ్వర్ పూజారాకి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇది 16వ డబుల్ సెంచరీ. ప్రస్తుత తరంలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆసియా ప్లేయర్‌గా నిలిచాడు ఛతేశ్వర్ పూజారా...
దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరుపున 7 డబుల్ సెంచరీలు చేసిన ఛతేశ్వర్ పూజారా, టీమిండియా తరుపున 3, ఇండియా ఏ జట్టు తరుపున 2, ఇండియా బ్లూ తరుపున ఓ డబుల్ సెంచరీ చేశాడు. ఇప్పుడు సుసెక్స్ క్లబ్ తరుపున 3 డబుల్ సెంచరీలు చేసి 16 ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీలను పూర్తి చేసుకున్నాడు...
మిడిల్‌సెక్స్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు ఛేతశ్వర్ పూజారా. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్, లీస్టర్‌షైర్ క్లబ్ తరుపున ఆడి 130 పరుగులు చేయగా గ్లామ్ తరుపున ఆడిన రవిశాస్త్రి 127 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు...
403 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 231 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, ఆఖరి వికెట్‌గా అవుట్ అయ్యాడు. అల్సప్ 277 బంతుల్లో 15 ఫోర్లతో 135 పరుగులు చేయగా ఇబ్రహిం 36 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 523 పరుగులకి ఆలౌట్ అయ్యింది సుసెక్స్...
మరోవైపు లంకాషైర్ క్లబ్ తరుపున ఆరంగ్రేటం చేసిన భారత ఆల్‌రౌండర్ వాష్టింగన్ సుందర్ తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 76 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్ రెండో బంతికే వికెట్ తీసిన వాషింగ్టన్ సుందర్ అద్భుత స్పెల్ కారణంగా నార్తింప్టన్‌షైర్ క్లబ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌట్ అయ్యింది..
అయితే వరుస వికెట్లు కోల్పోయిన లంకాషైర్ 132 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో 10 బంతులాడిన సుందర్, 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. జాక్ వైట్ 5 వికెట్లు తీసి లంకాషైర్‌ని స్వల్ప స్కోరుకే కట్టడి చేశాడు.
