ఐపీఎల్ 2020 సీజన్ విజయవంతంగా ముగిసినప్పటికీ ఆయా ఫ్రాంఛైజీల సోషల్ మీడియా అకౌంట్లు మాత్రం ఇంకా యాక్టీవ్‌గానే ఉన్నాయి. ఆటగాళ్లకి సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలు, మూమెంట్లను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

‘మాకెంతో ఇష్టమైన CUBG స్క్వాడ్‌ను బాగా మిస్ అవుతున్నాం. ఈ క్యూట్ మెమోరీస్ మీ హృదయాలను హత్తుకుంటాయని భావిస్తున్నాం’ అంటూ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది సీఎస్‌కే.
మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివా సింగ్ బైక్ నడిపే సీన్ నుంచి ఈ వీడియో మొదలవుతుంది.

 

 

ఆ తర్వాత బ్రావో, కోచ్ బాలాజీ, ప్లేయర్ షేన్ వాట్సన్, రైనా, మిగిలిన ప్లేయర్లు, స్టాఫ్ సభ్యుల పిల్లలు చేసే అల్లరి, వారితో కలిసి ఆడుకునే సందర్భాలతో ఈ వీడియోను నింపేశారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ప్లేయర్ సామ్ కుర్రాన్‌ను కూడా పిల్లాడిగా చూపిస్తూ చిల్ట్రెన్స్ డే విషెస్ తెలిపింది సీఎస్‌కే.