Asianet News TeluguAsianet News Telugu

IPL: ఐపీఎల్ వేలంలో బరిలో నిలిచిన ఆ చిన్నోడు పెద్దోడు ఎవరంటే..

IPL 2023 Auction: ఐపీఎల్  2023 సీజన్ కు గాను  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈనెల 23న కొచ్చి వేదికగా వేలం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో  వేలంలో పాల్గొనే అత్యంత చిన్న, పెద్ద  వయసు గల ఆటగాళ్ల  వివరాలు చూద్దాం. 

Check 5 Youngest and Oldest Players in Upcoming IPL Mini Auction Pool
Author
First Published Dec 17, 2022, 1:54 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్  2023 సీజన్ కోసం బీసీసీఐ ఈనెల 23న వేలం నిర్వహించబోతున్నది.   కొచ్చి వేదికగా జరిగే ఈ వేలానికి  వివిధ దేశాల నుంచి 405 మంది ఆటగాళ్లు  తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నారు. ఇందులో 132 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు.  బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో  282 మంది అన్ క్యాప్డ్ (ఇప్పటివరకూ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించనివాళ్లు) ఆటగాళ్లు ఉన్నారు.

87 స్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వేలానికి సంబంధించి  యాక్షన్ లో పాల్గొననున్న  అత్యంత తక్కువ వయసు గల ఆటగాళ్లు, అత్యధిక వయసున్న ఆటగాళ్లు ఎవరా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ నేపథ్యంలో తక్కువ వయసున్న ఐదుగురు, ఎక్కువ వయసున్న ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇక్కడ చూద్దాం. 

చిన్నోడు..

ఈ వేలంలో పేరు ఇచ్చిన ఆటగాళ్లలో అతి తక్కువ వయసున్న క్రికెటర్ అఫ్గానిస్తాన్ కుర్రాడు అల్లా మహ్మద్ ఘజన్‌పర్. 2007 జులై 15న జన్మించిన ఘజన్‌ఫర్ వయసు 15 ఏండ్ల   155 రోజులు మాత్రమే. ఈ కుడి చేతి వాటం ఆఫ్ స్పిన్నర్.. అఫ్గాన్ లోని ష్పగీజా క్రికెట్ లీగ్ లో  మిస్ ఐనక్ నైట్స్ తరఫున ఆడి అదరగొట్టాడు. తాజా వేలంలో   ఘజన్‌ఫర్ కనీస ధర రూ. 20 లక్షల జాబితాలో ఉన్నాడు. 

 

ఈ జాబితాలో తర్వాత ఉన్నవారిలో దినేశ్ బన (18 ఏండ్లు),  షకిబ్ హుస్సేన్ (18 ఏండ్ల మూడు రోజులు), కుమార్ కుషర్గ (18 ఏండ్ల 54 రోజులు), షకీల్ రషీద్ (18 ఏండ్ల 83 రోజులు) ఉన్నారు. 

 

పెద్దోడు.. 

వేలంలో ఉన్న జాబితాలో అత్యధిక వయసున్న ఆటగాడు భారత వెటరన్ అమిత్ మిశ్రా. ఈ  స్పిన్నర్ వయసు 40 ఏండ్లు. తన ఐపీఎల్ కెరీర్ లో  154 మ్యాచ్ లు ఆడిన  మిశ్రా..  166 వికెట్లు పడగొట్టాడు. 2008 నుంచి  ఈ లీగ్ లో ఆడుతున్న  మిశ్రా.. వయసు మీద పడుతున్నా ఈసారి వేలంలో తన పేరు ఇవ్వడం గమనార్హం. 

మిశ్రా తో పాటు  ఈ జాబితాలో ఉన్నవారిలో సౌతాఫ్రికా బ్యాటర్ క్రిస్టియాన్ జోంకర్  (36 ఏండ్లు), జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రాజా (36), నమీబియా క్రికెటర్ డేవిడ్ వీస్ (37 ఏండ్లు), ఆఫ్గాన్ మాజీ సారథి మహ్మద్ నబీ (37 ఏండ్లు) ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios