ఛతేశ్వర్ పూజారా... చాలామందికి ఈ పేరు చెప్పగానే జిడ్డు బ్యాటింగ్ గుర్తుకువస్తుంది. కొన్ని సందర్భాల్లో 100 బంతులకు పైగా ఆడినా డబుల్ డిజిట్ స్కోరు చేయడు పూజారా. 50 పరుగుల మార్కు అందుకోవడానికి 150కి పైగా బంతులను ఈజీగా తినేస్తాడు.

ఈ జిడ్డు బ్యాటింగ్ కారణంగానే ‘నయా వాల్’గా పేరొందిన ఛతేశ్వర్ పూజారా... ఏడేళ్ల విరామం తర్వాత ఈసారి ఐపీఎల్ 2021 ఆడబోతున్నాడు. టీ20ల్లో కూడా టెస్టు క్రికెట్ చూడబోతున్నామని పూజారాను కొనుగోలు చేసిన సీఎస్‌కేని ట్రోల్ చేసినవారికి ప్రాక్టీస్ సెషన్స్ నుంచే షాక్ ఇస్తున్నాడు ‘మోడ్రన్ వాల్’.

 

చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో ఛతేశ్వర్ పూజారా సిక్సర్లు బాదుతున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పూజారా ఒక్క సిక్సర్ బాదితే, తాను సగం మీసం తీయించుకుంటానని ఛాలెంజ్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. పూజారా ప్రాక్టీస్ చూస్తుంటే, ఐపీఎల్ 2021 సీజన్‌లో అశ్విన్ బౌలింగ్‌లోనే సిక్సర్లు బాదడం ఖాయంగా కనిపిస్తోంది...