Asianet News TeluguAsianet News Telugu

పూజారా అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

 94 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా.. 

105 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా...

Chateshwar Pujara out for 25 runs, team India lost 3rd wicket in 4th Test against Australia CRA
Author
India, First Published Jan 17, 2021, 6:14 AM IST

గబ్బా టెస్టులో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తన శైలికి తగ్గట్గుగానే 94 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా.. హజల్‌వుడ్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

105 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా. ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే కలిసి మూడో వికెట్‌కి 45 పరుగుల భాగస్వామ్యం జోడించారు. పూజారా, రహానే మధ్య విదేశాల్లో గత 18 ఇన్నింగ్స్‌ల్లో సగటు భాగస్వామ్యం 25.22 పరుగులే. చివరిగా 2018-19 ఆసీస్ పర్యటనలో 50+ భాగస్వామ్యం నెలకొల్లారు ఈ ఇద్దరూ.

ఈ దశలో ఆస్ట్రూలియాపై గత మూడు సిరీస్‌లలో 21 ఇన్నింగ్స్‌లు ఆడిన పూజారా, 3000 బంతులను ఎదుర్కొన్న ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తం భారత క్రికెటర్లు ఎదుర్కొన్న బంతుల్లో ఇది 27 శాతం.

Follow Us:
Download App:
  • android
  • ios