Asianet News TeluguAsianet News Telugu

Asianet News exclusive: ఐపీఎల్‌ భారత్‌లోనే.. త్వరలో షెడ్యూల్ విడుదల

IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ బీసీసీఐకి సవాల్‌గా మారింది. 

chairman of IPL Mr Arun Dhumal says The entire IPL will be played in India This was confirmed to Asianet News KRJ
Author
First Published Mar 16, 2024, 11:18 PM IST

IPL 2024:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను విదేశాల్లో నిర్వహించబోమని , IPL మొత్తం మ్యాచ్ లను  భారత్ లోనే నిర్వహిస్తామని ఐపీఎల్ ఛైర్మన్ మిస్టర్ అరుణ్ ధుమాల్ తెలిపారు. 

ఐపీఎల్ ఛైర్మన్  అరుణ్ ధుమాల్  శనివారం (మార్చి 16) ఏషియానెట్ న్యూస్‌ తో  మాట్లాడుతూ.. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి మారవచ్చని ఊహాగానాలను తోసిపుచ్చుతూ మొత్తం లీగ్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని ఐపీఎల్ ఛైర్మన్ మిస్టర్ అరుణ్ ధుమాల్  స్పష్టం చేశారు. మొదటి షెడ్యూల్ మాత్రమే  కాదు.. రెండవ షెడ్యూల్ కూడా భారత్ లో సాగుతుందని అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ షెడ్యూల్ పై కసరత్తు చేస్తున్నామనీ, త్వరలోనే ఐపిఎల్ పాలకమండలి షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని తెలిపారు. ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత భారత్‌లో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ ద్వితీయార్థం దుబాయ్‌కి మారే అవకాశం ఉందని మీడియాలో ఊహాగానాలు సాగుతున్నాయి. ఐపీఎల్ ఛైర్మన్  అరుణ్ ధుమాల్   ఆ ఊహాగానాలను తోసిపుచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios