బ్రాండు బాబులు తగ్గించుకోవాలి: ముందుకొచ్చిన కోహ్లీ
మార్కెట్లో తమ బ్రాండ్ విలువను దూకుడుగా దూసుకెళ్లేందుకు క్రికెట్, సినీ తారలతో భారీ ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఇప్పుడు కొత్త ప్రతిపాదన చేస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ సెలబ్రిటీ కంపెన్సెషన్ నివేదికలో ప్రచారకర్తలు (బ్రాండ్ అంబాసిడర్లు) 20-30 శాతం కోత విధించుకోవాలని అభిప్రాయపడ్డాయి.
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం షట్ డౌన్ లో ఉండిపోయింది. లాక్ డౌన్ దెబ్బకు ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా పడకేసింది. అన్ని రంగాలు కూడా కరోనా దెబ్బకు పూర్తిగా అతలాకుతలం అయిపోయాయి.
అన్ని రంగాల్లో ఆర్థికంగా లెక్కలేనన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవటంపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా, తొలుత ప్రచార, ప్రకటనలపై కాస్ట్ కటింగ్ దిశగా అడుగులు వేస్తున్నాయి.
మార్కెట్లో తమ బ్రాండ్ విలువను దూకుడుగా దూసుకెళ్లేందుకు క్రికెట్, సినీ తారలతో భారీ ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఇప్పుడు కొత్త ప్రతిపాదన చేస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ సెలబ్రిటీ కంపెన్సెషన్ నివేదికలో ప్రచారకర్తలు (బ్రాండ్ అంబాసిడర్లు) 20-30 శాతం కోత విధించుకోవాలని అభిప్రాయపడ్డాయి.
కోవిడ్-19 కష్టకాలంలో ప్రచారకర్తలు కచ్చితంగా కోతకు సిద్ధపడాలని 64 శాతం కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. విరాట్ కోహ్లి, ఎం.ఎస్ ధోని, రోహిత్ శర్మ, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణె, రణబీర్ కపూర్, ఆలియా భట్‌లు తమ ఒప్పందంలో కోతకు సిద్ధపడాలని కంపెనీలు కోరుతున్నాయి. కరోనా సమయంలోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లతో దండిగా సంపాదించిన విరాట్ కోహ్లి స్వచ్ఛందంగా కోతకు సిద్ధపడనున్నట్టు తెలుస్తోంది.
ఇది కేవలం క్రీడారంగానికి మాత్రమే పరిమితం కాదు అన్ని రంగాల్లోని వారు సైతం ఇందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ ఏకంగా తన రెమ్యూనరేషన్ లోనే 30 శాతం కోతకు సిద్ధపడ్డ విషయం తెలిసిందే.