Asianet News TeluguAsianet News Telugu

అర్ష్‌దీప్ మాట్లాడుతుంటే పట్టించుకోని కెప్టెన్! నీకంటే కోహ్లీ బెటర్ అంటూ... వీడియో వైరల్...

అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్లిపోయిన రోహిత్ శర్మ... సోషల్ మీడియాలో వీడియో వైరల్... రోహిత్‌ కెప్టెన్‌గా పనికి రాడంటూ...

Captain Rohit Sharma behavior gets trolled after video viral with Arshdeep Singh in Asia Cup
Author
First Published Sep 7, 2022, 6:16 PM IST

ఐపీఎల్ కెప్టెన్‌గా మోస్ట్ సక్సెస్‌ఫుల్ అయ్యాడు రోహిత్ శర్మ. అదే సక్సెస్‌తో టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా మారి, ఆసియా కప్ 2018లో భారత జట్టుకి ఛాంపియన్‌గానూ నిలిపాడు. అయితే నాలుగేళ్ల తర్వాత భారత జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 టీ20 టీమ్‌గా, టైటిల్ ఫెవరెట్‌గా ఆసియా కప్ 2022 టోర్నీని ఆరంభించిన భారత జట్టు... సూపర్ 4 స్టేజీలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఫైనల్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది...

ఇప్పుడు టీమిండియా ఫైనల్ చేరాలంటే ఆఫ్ఘాన్ అద్భుతం చేయాలి. లంక వీరంగం సృష్టించాలి. ఇలా ఏవేవో లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. టీమిండియా ఈ పరిస్థితికి రోహిత్ శర్మ కెప్టెన్సీయే కారణంగా చూపిస్తున్నారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్...

ఐపీఎల్‌లో కూల్ అండ్ కామ్ కెప్టెన్సీతో బీభత్సమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు రోహిత్ శర్మ. ఆరంభంలో టీమిండియా కెప్టెన్‌గానూ ఇంతే కూల్‌గా కనిపించాడు. అయితే ఆసియా కప్ 2022లో రోహిత్ బాడీ లాంగ్వేజీలో తేడా కనిపించింది. తన సహజ స్వభావానికి భిన్నంగా ప్లేయర్లపై ఆగ్రహం చూపించిన రోహిత్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే పట్టించుకోకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది...

టీమిండియా విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 21 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్, 14 పరుగులు సమర్పించాడు. ఇందులో రెండు వైడ్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. దీంతో ఆఖరి ఓవర్‌లో లంక విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి. చేతిలో 7 వికెట్లు ఉండడంతో ఏ జట్టుకైనా ఇది చాలా తేలికైన టార్గెట్...

చేయాల్సిన టార్గెట్ పెద్దగా లేకపోవడంతో క్రీజులో ఉన్న రాజపక్ష, శనక ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా సింగిల్స్, డబుల్స్ తీయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. మొదటి 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి కూడా సింగిల్ వచ్చింది.

ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన దశలో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్ దగ్గరికి వెళ్లి ఏదో సలహా ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి, ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు అర్ష్‌దీప్ సింగ్. అయితే అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది... ఇంక ఏం చేస్తే మాత్రం ఏం లాభం! అనుకున్నాడో ఏమో కానీ రోహిత్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే పట్టించుకోకుండా వెళ్లిపోయాడు కెప్టెన్ రోహిత్ శర్మ...

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మకు తన ప్లేయర్లపైనే పూర్తి నమ్మకం లేనప్పుడు, ఇంక మ్యాచులు ఎలా గెలుస్తాడని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. యంగ్ ప్లేయర్ ఏం చెబుతున్నాడో కూడా వినిపించుకోకుండా అలా వెళ్లిపోవడం, అర్ష్‌దీప్ సింగ్‌ని అవమానించడమే అంటున్నారు మరికొందరు అభిమానులు...

ఇంకొందరు మాత్రం అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడుతుంటే రోహిత్ శర్మ పట్టించుకోకుండా వెళ్లలేదని, అతను వెనక్కి తిరిగినా బౌలర్లకు సమాధానం ఇచ్చాడని అంటున్నారు. సగం సగం వీడియో చూసి అర్ష్‌దీప్ సింగ్‌ని, రోహిత్ అవమానించడని అనడం కరెక్ట్ కాదని అంటున్నారు...

విరాట్ కోహ్లీ బౌలర్లను పూర్తిగా నమ్మేవాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన మహ్మద్ షమీ, యజ్వేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్ సక్సెస్‌ఫుల్ కావడానికి కూడా ఇదే కారణం. షమీ చాలా సార్లు ఈ విషయాన్ని ప్రకటించాడు కూడా. కానీ రోహిత్ శర్మకి మాత్రం తన బౌలర్లపైనే పూర్తి నమ్మకం లేదని కామెంట్లు చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్... రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్‌గా పనికి రాడంటూ, అతనికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మాత్రం వస్తుందని ‘#SackRohit’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు..
 

Follow Us:
Download App:
  • android
  • ios