024 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కి కెనడా ప్రకటించిన జట్టులో డేనియల్ మెక్‌గాహేకి చోటు... 2020లో లింగ మార్పిడి చేయించుకున్న డేనియల్ మెక్‌గాహే...
ట్రాన్స్‌జెండర్ల కోసం హక్కుల కోసం ప్రపంచమంతా సానుకూలంగా స్పందిస్తోంది. తాజాగా కెనడా ఉమెన్స్ టీ20 టీమ్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ చోటు దక్కించుకుంది. డేనియల్ మెక్‌గాహే, అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు క్రియేట్ చేయనుంది..
బంగ్లాదేశ్‌లో జరిగే 2024 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కి కెనడా ప్రకటించిన జట్టులో డేనియల్ మెక్‌గాహేకి చోటు దక్కింది. ఐసీసీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో డేనియల్ మెక్‌గాహే మెరిట్ మార్కులతో పాస్ అయ్యింది. దీంతో ఆమె త్వరలోనే అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయడం ఖాయంగా మారింది..
2020లో ఆస్ట్రేలియా నుంచి కెనడాకి వలస వెళ్లింది డేనియల్ మెక్‌గాహే. అదే ఏడాది మహిళాగా జెండర్ ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న మొట్టమొదటి మహిళగా రికార్డు క్రియేట్ చేయబోతుండడం తనకు గర్వంగా ఉందని ప్రకటించింది డేనియల్ మెక్‌గాహే..
‘ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని వరల్డ్ క్రికెట్‌లో రిప్రెజెంట్ చేయబోతున్నా. ఇది నిజం అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఐసీసీకి నా మెడికల్ సమాచారాన్ని పంపించి, నాకు అన్ని విధాలుగా సాయం చేసిన నా డాక్టర్‌ని స్పెషల్ థ్యాంక్స్.
ఐసీసీ, ప్రతీ నెలా నా రక్త నమూనాలను స్వీకరించింది. అదే నాకు పెద్ద సవాల్‌గా మారింది. క్రికెట్ ఆడుతున్నప్పుడు, అక్కడా ఇక్కడా అని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో రక్త నమూనాలు ఇవ్వడం చాలా రిస్క్. అయితే డాక్టర్ సహకారంతో అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయగలిగా. ప్రోటోకాల్‌ని అనుసరించి, మహిళా క్రికెటర్‌గా ముద్ర వేసుకోగలిగా.’ అంటూ చెప్పుకొచ్చింది డేనియల్ మెక్‌గాహే...
ఐసీసీ నియమావళి ప్రకారం, ట్రాన్స్‌జెండర్ మహిళలు, మహిళా క్రికెటర్ ఆడాలనుకుంటే వారి బ్లడ్ సిరమ్‌ని 12 నెలల పాటు పరీక్షిస్తారు. మహిళ లక్షణాలు ఉన్నాయని నిర్ధారణ అయితేనే ఉమెన్స్ క్రికెట్ టీమ్‌లో ఆడడానికి అనుమతి ఇస్తారు... ఈ పరీక్షలన్నీ క్లియర్ చేసిన డేనియల్ మెక్‌గాహే, క్రికెట్ ఆడాలనుకునే ట్రాన్స్‌జెండర్లకు ఆదర్శప్రాయంగా నిలిచింది.
