Asianet News TeluguAsianet News Telugu

కామెరూన్ గ్రీన్‌పై కనక వర్షం... బెన్ స్టోక్స్‌కి బంపర్ ప్రైజ్! మినీ వేలంలో మెగా రికార్డులు...

రూ.17.5 కోట్లకు కామెరూన్ గ్రీన్‌ని దక్కించుకున్న ముంబై ఇండియన్స్.. రూ.16.25 కోట్లకు బెన్ స్టోక్స్‌ని కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. 

Cameron Green gets huge price along with England captain Ben Stokes in IPL 2023 Mini Auction
Author
First Published Dec 23, 2022, 3:44 PM IST

IPL 2023 Mini Auction: రాజస్థాన్ రాయల్స్, జాసన్ హోల్డర్‌ని రూ.5 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ హోరాహోరీగా బిడ్డింగ్ చేశాయి.  ముంబై ఇండియన్స్ జట్టు రూ.17.5 కోట్లకు కామెరూన్ గ్రీన్‌ని దక్కించుకుంది. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ కోసం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ బరిలో నిలిచాయి. పర్సులో రూ.7.45 కోట్లు పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్, రూ.7.25 కోట్ల వరకూ బెన్ స్టోక్స్ కోసం బిడ్ చేసింది...

రాజస్థాన్ రాయల్స్ బిడ్డింగ్ నుంచి తప్పుకున్న తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా రేసులోకి వచ్చి రూ.16.25 కోట్లకు బెన్ స్టోక్స్‌ని కొనుగోలు చేసింది.. 

ఓడియన్ స్మిత్‌ని సీఎస్‌కే రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రాజాని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.. 

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్ ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతవరకూ 2021 వేలంలో రూ.16.25 కోట్లు దక్కించుకున్న క్రిస్ మోరిస్ రికార్డును బ్రేక్ చేసిన సామ్ కుర్రాన్, రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కి అమ్ముడుపోయాడు... 

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ కోసం ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడ్డాయి. ఫ్రాంఛైజీలు ఏ మాత్రం ఆలోచించకుండా బిడ్డింగ్ వేస్తూ పోవడంతో 2 నిమిషాల్లోనే రూ.10 కోట్ల ప్రైజ్ దాటేశాడు సామ్ కుర్రాన్...

పర్సులో రూ.20 కోట్లు కూడా లేని చెన్నై సూపర్ కింగ్స్, సామ్ కుర్రాన్ కోసం రూ.15.25   కోట్ల వరకూ బిడ్ చేసింది.ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ టీమ్, కుర్రాన్ కోసం పోటీకి వచ్చింది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్‌ని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్. గత ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా రూ.14 కోట్లు తీసుకున్న కేన్ విలియంసన్, ఈ సీజన్‌లో రూ.2  కోట్లకు గుజరాత్ తరుపున ఆడబోతున్నాడు...

ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషన్ హారీ బ్రూక్ కోసం ఫ్రాంఛైజీలన్నీ పోటీపడ్డాయి. రూ.10 కోట్లు దాటిన తర్వాత రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు హారీ బ్రూక్ కోసం పోటీపడడంతో ధర అంతకంతకూ పెరుగుతూపోయింది. చివరికి రూ.13 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి హారీ బ్రూక్‌ని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.. 

భారత బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..  భారత టెస్టు ప్లేయర్ అజింకా రహానేని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...

Follow Us:
Download App:
  • android
  • ios