సైలెంట్‌గా టీవీ యాంకర్ సంజన గణేశన్‌తో ప్రేమాయణం నడిపించి, అంతే సైలెంట్‌గా ఆమెను వివాహం చేసుకున్నాడు భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా.

కేవలం 20 మంది ఆత్మీయబంధువుల మధ్య గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన బుమ్రా వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. 

సంగీత్ వీడియోలో బాలీవుడ్ పాపులర్ సాంగ్ ‘వాలియన్‌’కి సంజన గణేశన్‌తో కలిసి స్టెప్పులేస్తూ కనిపించాడు జస్ప్రిత్ బుమ్రా... జట్టులో ఎంతో సైలెంట్ పర్సెన్‌గా, ఇంట్రోవర్ట్‌గా గుర్తింపు పొందిన బుమ్రా, వ్యక్తిగత కారణాలు చెప్పి ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు నుంచి లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే.

బీసీసీఐ అధికారి, బుమ్రా లీవ్ తీసుకోవడానికి కారణం పెళ్లేనని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. మొదట సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లాడబోతున్నట్టు ప్రచారం జరిగినా, వాటిని ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసింది హీరోయిన్ తల్లి.