ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్.  ఓ సెంచరీతో పాటు 189 పరుగులు చేసిన అశ్విన్, 32 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 

టెస్టు సిరీస్‌ అనంతరం భర్తకు శుభాకాంక్షలు తెలిపిన ప్రీతి అశ్విన్... ‘ఇక చాలు, బయో బబుల్‌ను బ్రేక్ చేసి, వెంటనే ఇంటికి వచ్చేయండి’ అంటూ హార్ట్ సింబల్‌తో మెసేజ్ పోస్టు చేసింది.  ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభమైన గత ఏడాది సెప్టెంబర్ నుంచి బయో బబుల్‌లో గడుపుతున్నారు చాలామంది క్రికెటర్లు.

రవిచంద్రన్ అశ్విన్, అజింకా రహానే, సిరాజ్, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్లకయితే కుటుంబంతో స్వేచ్ఛగా గడపడానికి రెండు వారాల సమయం కూడా దక్కలేదు. ఎట్టకేలకు స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్ ముగియడంతో టెస్టు ప్లేయర్లకు విశ్రాంతి దొరకనుంది.

టీ20, వన్డే సిరీస్‌ల్లో చోటు దక్కించుకోని రవిచంద్రన్ అశ్విన్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, ఇషాంత్ శర్మ వంటి ప్లేయర్లు బయో బబుల్ జోన్ నుంచి బయటికి వెళ్లనున్నారు.