ఐపీఎల్ 2022 వేలంలో పెద్ద పొరపాటు... ఖలీల్ అహ్మద్ విషయంలో పొరపాటు పడిన ఆక్షినర్, టెక్నికల్ సిబ్బంది... ముంబై ఇండియన్స్ జట్టు కోట్ చేసిన ధరకే ఢిల్లీ క్యాపిటల్స్‌కి...
ఐపీఎల్ 2022 మెగా వేలం పూర్తయ్యింది. రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.551.7 కోట్లు ఖర్చు కాగా, 204 మంది ప్లేయర్లు అమ్ముడయ్యారు. 11 మందికి రూ.10 కోట్లకు పైగా దక్కించుకున్న ఈ వేలంలో ఓ పెద్ద తప్పిదం, తాజాగా వెలగులోకి వచ్చింది... ఐపీఎల్ 2022 మెగా వేలంలో మిగిలిన జట్ల కంటే తెలివిగా ప్లేయర్లను కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ.
శార్దూల్ ఠాకూర్ వంటి కొంత మంది ప్లేయర్ల కోసం ఎంత బిడ్ చేయడానికైనా సిద్ధమైన ఢిల్లీ క్యాపిటల్స్, వేలానికి వచ్చిన ప్రతీ ప్లేయర్ కోసం బిడ్ వేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది... చాలామంది ప్లేయర్లకు మొదటి బిడ్ వేసిన ఢిల్లీ క్యాపిటల్స్, సదరు ప్లేయర్ ధర రూ.5+ కోట్లు దాటిన తర్వాత పోటీ నుంచి తప్పుకుని, చాలా తెలివిగా వ్యవహరించింది. మిగిలిన జట్ల పర్సు ఖాళీ చేయాలనే ఢిల్లీ క్యాపిటల్స్ యజమానుల పన్నాగం, కొందరు ప్లేయర్ల విషయంలో మాత్రం మిస్ ఫైర్ అయ్యింది...
గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన పేసర్ ఖలీల్ అహ్మద్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్టు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని కిరణ్ కుమార్ గాంధీ, తన గుండు, ముఖంపై చిరునవ్వుతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు...
ఖలీల్ అహ్మద్ కోసం వేలం జరుగుతున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.5 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 5.25 కోట్లకు బిడ్ వేసింది. ఆ వెంటనే బిడ్ వేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో కాస్త అయోమయానికి గురైన కిరణ్ కుమార్ గాంధీ, కార్డు పైకెత్తి మళ్లీ దించేశాడు...
అయితే ఈ అతి తెలివి కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ వేసిందని భావించాడు ఆక్షనర్ చారు శర్మ. అయితే బిడ్ అమౌంట్ మాత్రం ముంబై ఇండియన్స్ కోట్ చేసిన రూ.5.25 కోట్లుగానే చూపించింది బిగ్ స్క్రీన్...
దీంతో బిడ్ అమౌంట్ మరిచిపోయిన ఆక్షనీర్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి రూ.5.25 కోట్లకే ఖలీల్ అహ్మద్ వెళ్తున్నట్టుగా ప్రకటించేశాడు. ఈ మొత్తాన్ని ముంబై ఇండియన్స్ టీమ్ సభ్యులు గమనిస్తూనే ఉన్నా, ఖలీల్ అహ్మద్ కోసం అంత మొత్తం చెల్లించడం వేస్ట్ అనే అభిప్రాయంతో సైలెంట్‌గా ఉండిపోయారు...
ధర పెంచి, ముంబై ఇండియన్స్ టీమ్ పర్సు ఖాళీ చేద్దామని చూసిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లాన్ బోల్తా కొట్టగా, రూ.5.25 కోట్లకు ముంబై టీమ్‌కి వెళ్లాల్సిన ఖలీల్ అహ్మద్, అదే ధరకు ఢీసీకి ఆడబోతున్నాడు...
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను కేవలం రూ.6.25 కోట్లకు దక్కించుకుని, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...
మొదటి సెట్‌లో వేలానికి వచ్చిన డేవిడ్ వార్నర్ కోసం కొన్ని ఫ్రాంఛైజీలు పోటీపడినా, ఆరంభంలోనే రూ.10+ కోట్లు పెట్టడానికి సాహసం చేయలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కి చాలా చవకగా వచ్చేశాడు వార్నర్ భాయ్...
శార్దూల్ ఠాకూర్ కోసం రూ.10.75 కోట్లు బిడ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, మరే ప్లేయర్ కోసం రూ.7 కోట్లు కూడా కోట్ చేయకపోవడం విశేషం. మిచెల్ మార్ష్‌ను రూ.6.5 కోట్లకు, ఖలీలమ్ అహ్మద్‌ను రూ.5.25 కోట్లకు, చేతన్ సకారియాని రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...
ముస్తఫిజుర్ రహ్మన్‌ను రూ.2 కోట్లకు, కుల్దీప్ యాదవ్‌ని రూ.2 కోట్లకు, రోవ్‌మన్ పావెల్‌ను రూ.2.8 కోట్లకు కొనుగోలు చేసిన ఢీసీ, కమ్లేశ్ నాగర్‌కోటిని రూ.1.1 కోట్లకు, మన్‌దీప్ సింగ్‌ని రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది...
లుంగి ఎంగిడి, టిమ్ సిఫర్ట్ వంటి విదేశీ ప్లేయర్లను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ, కెఎస్ భరత్‌ను రూ.2 కోట్లకు, ప్రవీణ్ దూబే రూ.50 లక్షలు, అండర్ 10 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ దుల్‌ని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది...
