Asianet News TeluguAsianet News Telugu

అనిల్ కుంబ్లేకి షాక్... ట్రేవర్ బేలిస్‌కి పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ పదవి...

నాలుగు సీజన్లుగా పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే... ట్రేవర్ బేలిస్‌ని ఐపీఎల్ 2023 సీజన్ హెడ్ కోచ్‌గా ప్రకటించిన పంజాబ్ కింగ్స్... 

Big shock for Anil Kumble, Trevor Bayliss appointed as the new head coach of Punjab Kings
Author
First Published Sep 16, 2022, 1:44 PM IST

అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌ని మార్చింది. గత మూడేళ్లగా పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేని ఆ బాధ్యతల నుంచి తప్పించిన టీమ్ మేనేజ్‌మెంట్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ ట్రేవర్ బేలిస్‌ని కొత్త కోచ్‌గా నియమించింది.

ఆస్ట్రేలియాకి చెందిన ట్రేవర్ బేలిస్, జాతీయ జట్టు తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అయితే కోచ్‌గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. శ్రీలంక జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రేవర్ బేలిస్, బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్, ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు...

కేకేఆర్‌కి రెండు ఐపీఎల్ టైటిల్స్ అందించిన ట్రేవర్ బేలిస్, ఇంగ్లాండ్ జట్టుకి హెడ్ కోచ్‌గా 2019 వన్డే వరల్డ్ కప్ అందించాడు. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రేవర్ బేలిస్, 2011-12 సీజన్‌లో ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్ కూడా గెలిచాడు..

ఈ విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ట్రేవర్ బేలిస్‌కి స్వాగతం పలికింది పంజాబ్ కింగ్స్. ‘ఎంతో అంకితభావం, టాలెంట్ ఉన్న ప్లేయర్లతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా...’ అంటూ ట్రేవర్ బేలిస్ వ్యాఖ్యానించాడు...

అయితే ఐపీఎల్‌లో గత రెండు సీజన్లు ట్రేవర్ బేలిస్‌కి పెద్దగా కలిసి రాలేదు. 2020-21 సీజన్లలో టామ్ మూడీ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రేవర్ బేలిస్, పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ట్రేవర్ బేలిస్ హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్‌కీ, అప్పటి ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కీ మధ్య విభేదాలు రావడంతో పెద్ద రచ్చే జరిగింది...

టీమ్ పర్పామెన్స్ బాగోలేదని డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత అతన్ని తుది జట్టు నుంచి తొలగించింది. అయితే వార్నర్ ప్లేస్‌లో కెప్టెన్‌గా నియమించబడిన కేన్ విలియంసన్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు...

2021 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 14 మ్యాచుల్లో మూడే విజయాలు అందుకోగలిగింది. అయితే పంజాబ్ కింగ్స్ పర్ఫామెన్స్‌ కూడా చెప్పుకోదగ్గంత గొప్పగా ఏమీ లేదు. 2008లో సెమీస్ చేరిన పంజాబ్ కింగ్స్, 2014లో ఫైనల్‌కి ప్రవేశించింది. అయితే అప్పుడు ట్రేవర్ బేలిస్ హెడ్ కోచ్‌గా ఉన్న కేకేఆర్ చేతుల్లో ఓడి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్...

ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న పంజాబ్ కింగ్స్, గత నాలుగు సీజన్లుగా ఆరో స్థానంలోనే కొనసాగుతోంది.  

2019 అక్టోబర్ నుంచి పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, లెక్కలేనంత మంది ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు... 

2023 సీజన్‌కి ముందు హెడ్ కోచ్‌గా వ్యవహరించేందుకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిలను సంప్రదించింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ ఇద్దరితో సంప్రదింపులు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్‌, పంజాబ్ కింగ్స్‌కి హెడ్ కోచ్ వ్యవహరించబోతున్నాడు...

Follow Us:
Download App:
  • android
  • ios