Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2021.. క్రిస్ గేల్ అరుదైన రికార్డ్..!

ఐపీఎల్‌ చరిత్రలో 350 సిక్సర్లు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను తెవాతియా బౌలింగ్‌లో సైతం మరో సిక్సర్‌ బాది ఆ సంఖ్యను 351కి పెంచుకున్నాడు. 

Big hitting Gayle becomes first player to hit 350 sixes in Ipl
Author
Hyderabad, First Published Apr 14, 2021, 9:15 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్) చరిత్రలో  విండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్, పంజాబ్ కింగ్స్ జట్టు సభ్యుడు క్రిస్ గేల్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. లీగ్‌ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్‌ బాస్‌ ఎవరికీ అందనంత ఎత్తుకి వెళ్లిపోయాడు. 

సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో అదిరిపోయే సిక్సర్‌ బాదిన గేల్‌.. ఐపీఎల్‌ చరిత్రలో 350 సిక్సర్లు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను తెవాతియా బౌలింగ్‌లో సైతం మరో సిక్సర్‌ బాది ఆ సంఖ్యను 351కి పెంచుకున్నాడు. 

ఇదిలా ఉంటే, లీగ్‌ చరిత్రలో మరే ఇతర బ్యాట్స్‌మన్‌ కనీసం 250 సిక్సర్ల మార్క్‌ కూడా చేరుకోలేకపోవడం విశేషం. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, ఆర్‌సీబీ కీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ 237 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారధి ధోని 216 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 

ఈ జాబితాలో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 214, బెంగళూరు కెప్టెన్‌ కోహ్లి 201 సిక్సర్లతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు ఆడిన గేల్‌ 351 సిక్సర్లు బాదాడు. కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పంజాబ్‌ కింగ్స్‌ అదిరిపోయే బోణీ కొట్టింది. పంజాబ్‌ భారీ స్కోర్‌ నమోదు చేయడంలో గేల్‌(28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన వంతు పాత్ర పోషించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios