Asianet News TeluguAsianet News Telugu

గ్లెన్ మ్యాక్స్‌వెల్ సునామీ సెంచరీ... బిగ్‌బాష్ లీగ్‌లో రికార్డు స్కోరు...

BBL 2021-22 హోబర్ట్ హరీకేన్స్‌తో మ్యాచ్‌లో  64 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 154 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్...బీబీఎల్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు... 

Big Bash League 2022: Glenn Maxwell Record Score against Melbourne Stars vs Hobart Hurricanes
Author
India, First Published Jan 19, 2022, 4:38 PM IST

ఆసీస్ బ్యాట్స్‌మెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్... బిగ్ బాష్ లీగ్‌లో బీభత్సం సృష్టించాడు. మెల్‌బోర్న్ స్టార్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, హోబర్ట్ హరీకేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బీబీఎల్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు బాదాడు. 

‘మ్యాడ్’ మ్యాక్స్ బాదుడికి మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు, టీ20 చరిత్రలోనే మూడో అత్యధిక టీమ్ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచిన హోబర్ట్ హరికేన్స్ కెప్టెన్ మాథ్యూ వేడ్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ స్కోరు చేసింది...

వికెట్ కీపర్ జో క్లార్క్ 18 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసి అవుట్ కాగా నిక్ లార్కిన్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి వికెట్‌కి జో క్లార్క్‌తో కలిసి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మ్యాక్స్‌వెల్, ఆ తర్వాత 3 పరుగులు చేసిన నిక్‌ లార్కిన్‌తో కలిసి రెండో వికెట్‌కి 44 పరుగులు జోడించాడంటే... మనోడి బ్యాటింగ్ ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవ్చు...

మార్నస్ స్టోయినిస్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేయగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 64 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 154 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... ఇప్పటిదాకా మార్కస్ స్టోయినిస్, సిడ్నీ సిక్సర్‌పై చేసిన 147 పరుగులే బీబీఎల్‌లో అత్యధిక స్కోరుగా ఉండేది.

టీ20 చరిత్రలో ఇది మూడో అత్యధిక స్కోరు. ఇంతకుముందు ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 278/3 పరుగుల స్కోరు చేయగా, టర్కీపై చెక్ రిపబ్లిక్ జట్టు 278/4 పరుగుల స్కోరు చేసింది. ఇది మూడో అత్యధికం...

బిగ్ బాష్ లీగ్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 150+ పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్... మ్యాడ్ మ్యాక్స్ వీరబాదుడికి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక మాథ్యూ వేడ్ ఏకంగా 8 బౌలర్లను ఉపయోగించాడు. అయినా ఫలితం లేకపోయింది. బౌలింగ్ చేసిన ప్రతీ ఒక్కరూ 10+ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు...

గ్లెన్ మ్యాక్స్‌వెల్ సూపర్ షోతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్, మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ పర్ఫామెన్స్‌పై లక్నో ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు... ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను, బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ స్టార్స్ జట్టు బిగ్‌బాష్ లీగ్ టైటిల్ గెలిస్తే, ఐపీఎల్ 2022 సీజన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆర్‌సీబీ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. 

ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త జట్టుగా ఎంట్రీ ఇవ్వబోతున్న లక్నో జట్టు, కెఎల్ రాహుల్‌ను రూ.15 కోట్లకు, మార్కస్ స్టోయినిస్‌ని రూ.11 కోట్లకు డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్ యంగ్ ప్లేయర్ రవి భిష్ణోయ్‌ని కూడా రూ.4 కోట్లు కొనుగోలు చేసింది లక్నో...

Follow Us:
Download App:
  • android
  • ios