Asianet News TeluguAsianet News Telugu

భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ పై భారీ అంచనాలు... టికెట్ల అమ్మకాల్లోనే రికార్డు

ఈ  నెల చివర్లో ప్రారంభంకానున్న ఐసిసి వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ  ముఖ్యంగా ఈ మెగా  టోర్నీలో భారత్-పాక్  మధ్య జరిగే మ్యాచ్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.  చాలారోజుల  తర్వాత జరుగుతున్న దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో ఈ మ్యాచ్ టికెట్లను అమ్మకానికి పెట్టగా అవన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అత్యంత తక్కువ సమయంలోనే ఈ  టికెట్ల అమ్మకం జరిగినట్లు ఐసిసి ప్రకటించింది. 

bharath-Pakistan World Cup Match Tickets Sold Out
Author
Manchester, First Published May 6, 2019, 2:06 PM IST

ఈ  నెల చివర్లో ప్రారంభంకానున్న ఐసిసి వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ  ముఖ్యంగా ఈ మెగా  టోర్నీలో భారత్-పాక్  మధ్య జరిగే మ్యాచ్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.  చాలారోజుల  తర్వాత జరుగుతున్న దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో ఈ మ్యాచ్ టికెట్లను అమ్మకానికి పెట్టగా అవన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అత్యంత తక్కువ సమయంలోనే ఈ  టికెట్ల అమ్మకం జరిగినట్లు ఐసిసి ప్రకటించింది. 

ఇంగ్లాండ్ వేదికన జరగనున్న వరల్డ్ కప్ 2019 లో భారత్-పాక్ మ్యాచ్ కు మంచెస్టర్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. జూన్ 16న జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లను ఇటీవలే అమ్మకానికి పెట్టారు. అయితే కేవలం 48 గంటల్లోనే మొత్తం టికెట్లు అమ్ముడుపోయినట్లు వెల్లడించారు. దీన్ని బట్టే దాయాదుల పోరుకోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. 

ఇదే మాంచెస్టర్  స్టేడియంలో జూన్ 26వ తేదీన భారత్-వెస్టిండిస్ జట్లు తలపడనున్నాయి. కానీ భారత్-పాక్ మ్యాచ్ పై  నెలకొన్న ఆసక్తిని  ఈ  మ్యాచ్ పై కనిపించడం లేదు. భారతీయ అభిమానులయితే టికెట్లన్నీ  అమ్ముడుపోయినట్లు తెలిసినా ఇంకా వాటికోసం తమను సంప్రదిస్తూనే వున్నారని వరల్డ్ కప్ నిర్వహకులు వెల్లడించారు. 

భారత్-పాక్ మ్యాచ్ గురించి క్రికెట్ ల్యాంకషైర్  కార్పోరేట్ బిజినెస్ డెవలపర్ మేనేజర్ డేన్ వైట్ హెడ్ మాట్లాడుతూ...ఇండియా- ఇంగ్లాండ్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ కే ఎక్కువ  డిమాండ్  కనిపిస్తోందన్నారు. ఈ ప్రపంచ కప్ మెగా  టోర్నీలో ఈ మ్యాచే హైలైట్ నిలిచే అవకాశం వుందన్నారు. 

'' కొద్దిరోజుల క్రితం టీమిండియా  ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఈ స్టేడియంలో  ఓ టీ20 మ్యాచ్ ఆడింది.  ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన భారత జట్టు అభిమానులతో స్టేడియం నిండిపోయింది. స్టేడియం మొత్తం టీమిండియా అభిమానులు,భారత అర్మీ సభ్యులతో నిండిపోయింది. అయితే ప్రస్తుత  పరిస్థితులనుు గమనిస్తే ఈ మ్యాచ్ కంటే ఎక్కువ సందడి భారత్-పాక్ మ్యాచ్ లో వుంటుందని  అనుకుంటున్నా'' అంటూ  వైట్‌హెడ్ అభిప్రాయపడ్డాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios